Viral Video: థాయ్‌లాండ్‌లో మోడీ హవా? నైట్ క్లబ్‌లో మోడీ ప్రసంగం డీజే సాంగ్ రీమిక్స్.. వీడియో వైరల్
నైట్ క్లబ్, DJ నైట్‌ల్లో సందడి చేస్తూ ఎంజాయ్ చెయ్యడానికి రోజూ భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. టూరిస్టులు స్ట్రీట్ల్లో ఫుట్ పాత్ మీద, నైట్ క్లబ్‌లలో తిరుగుతు ఉన్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఓ ప్రత్యేక వీడియో హల్‌చల్ చేస్తోంది. పట్టాయాలోని ఓ నైట్ క్లబ్‌లో ప్రధాని మోడీ ప్రసంగానికి సంబంధించిన రీమిక్స్ చేసిన డీజే సాంగ్ ప్లే చేయగా, పార్టీలో ఉన్నవారంతా ఈ డీజే పాటకు డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి థాయిలాండ్ కలల దేశం. ముఖ్యంగా నేటి యువత థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో రాత్రివేళ సరదాగా గడపాలని కోరుకుంటారు. ఇక్కడ అనేక అందమైన ప్రదేశాలున్నాయి. వీటిల్లో ఆనందించవచ్చు. ముఖ్యంగా ఈ పట్టాయా రంగురంగుల డిస్కో బార్‌లు, వాకింగ్ స్ట్రీట్, నైట్ క్లబ్‌లకు చాలా ప్రసిద్ధి చెందింది. నైట్ క్లబ్, DJ నైట్‌ల్లో సందడి చేస్తూ ఎంజాయ్ చెయ్యడానికి రోజూ భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. టూరిస్టులు స్ట్రీట్ల్లో ఫుట్ పాత్ మీద, నైట్ క్లబ్‌లలో తిరుగుతు ఉన్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఓ ప్రత్యేక వీడియో హల్‌చల్ చేస్తోంది.
పట్టాయాలోని ఓ నైట్ క్లబ్‌లో ప్రధాని మోడీ ప్రసంగానికి సంబంధించిన రీమిక్స్ చేసిన డీజే సాంగ్ ప్లే చేయగా, పార్టీలో ఉన్నవారంతా ఈ డీజే పాటకు డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. వీలైనంత త్వరగా థాయ్‌లాండ్‌లో బీజేపీ ప్రభుత్వం పార్టీ పెట్టబోతుందన్న సంకేతాలన్నీ కనిపిస్తున్నాయని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో X ఖాతా @keh ke Pehenoలో షేర్ చేశారు. త్వరలో థాయ్‌లాండ్‌లోని BJP ప్రభుత్వం.. పట్టాయా నైట్ క్లబ్ సీన్స్” అని క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకి
వైరల్ వీడియో ఇక్కడ ఉంది
BJP govt in Thailand soon.. Scenes from a night club in Pattaya 😄pic.twitter.com/dNeLWhOAHl
— Keh Ke Peheno (@coolfunnytshirt) February 2, 2024
వైరల్ వీడియోలో పట్టాయాలోని నైట్ క్లబ్‌లో ప్రధాని మోడీ ప్రసంగంలోని సారాంశాలతో కూడిన రీమిక్స్ చేసిన పాటను DJలో ప్లే చేశారు. అక్కడ గుమిగూడిన వారంతా ఈ డీజే పాటకు స్టెప్పులు వేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.
ఫిబ్రవరి 02న షేర్ చేసిన ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్, ఆరు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు బహుశా ఈ క్లబ్ యజమాని గుజరాత్ లేదా పంజాబ్‌కు చెందినవారై ఉండవచ్చు” అని అన్నారు. మరొకరు ఇది నిజంగా పట్టాయాలోని దృశ్యమా?” అని కామెంట్ చేశారు ‘థాయ్‌లాండ్‌లో త్వరలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది’ అని మరో యూజర్ ఫన్నీ కామెంట్ రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..