Viral: భర్త నుంచి వచ్చే చెమట వాసన తట్టుకోలేక విడాకులు కోరిన మహిళ.. కోర్టు ఏం చేసిందంటే…?
'నా భర్త స్నానం చేయడు, పళ్ళు తోముకోడు, అతని చెమట వాసనతో బతకడం కష్టం, నాకు విడాకులు ఇప్పించండి' అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఒక రోజు బ్రెష్ చేయకపోతేనే వాసన ఓ రేంజ్‌లో వస్తుంది. అలాంటి ఈయన వారానికి కుదిరితే 2 సార్లు.. కుదరకపోతే ఒక్కరోజు బ్రెష్ చేస్తాడట. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు.

నా భర్త 10 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తాడు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పళ్ళు తోముకుంటాడు. దీంతో అతని నోరు, శరీరం నుంచి దుర్వాసన వస్తోంది.. అతడితో కలిసి జీవించలేను.. విడాకులు ఇప్పించండి మహాప్రభో అంటో ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది . ఆడిట్ సెంట్రల్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించనందున ఒక భార్య తన భర్తపై విడాకుల కేసును దాఖలు చేసింది. భర్తపై భార్య చేసిన ఆరోపణలను ధృవీకరించడానికి.. అతని సహోద్యోగులను కూడా కోర్టులో సాక్షులుగా హాజరుపరిచారు. వారందరూ నిందితుడి వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేదని నిర్ధారిస్తూ వాంగ్మూలాలు ఇచ్చారు. దీంతో విడాకుల కోసం మహిళ చేసిన అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. అంతే కాకుండా 16,500 డాలర్లు అంటే దాదాపు రూ. 13 లక్షల 69 వేలు పరిహారం ఇవ్వాలని ఆ వ్యక్తికి ఆదేశించింది.
భాగస్వామి ప్రవర్తన కారణంగా జీవితం ఇబ్బందికరంగా మారితే, విడాకుల కోసం దాఖలు చేసే హక్కు ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. మానవ సంబంధాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మన ప్రవర్తన, శుభ్రత రెండింటిపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం విడాకులు ఇచ్చిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి 2018లో, తైవాన్‌కు చెందిన వ్యక్తి తన భార్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానం చేయడం వల్ల ఆమెకు విడాకులు ఇచ్చాడు. మూడు సంవత్సరాల క్రితం ప్రతిరోజూ స్నానం చేయనందున తనకు విడాకులు ఇవ్వాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం చర్చనీయాశమైంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
