Twins: పుట్టగానే విడిపోయారు, 30 ఏళ్ల తర్వాత కలిశారు.. అక్కాచెల్లెల్ని కలిపిన..

వివరాల్లోకి వెళితే.. వారిద్దరూ నాన్ ఐడెంటికల్ కవలలు అంటే ఎలాంటి పోలికలు లేని ట్విన్స్ అన్నమాట. ఇండోనేషియాలోని ఒక అనాథాశ్రమంలో పుట్టిన వెంటనే చెరొక ఇంటికి దత్తత వెళ్లడంతో విడిపోయారు. అయితే కొన్నేళ్ల తరువాత ఆ ఇద్దరిలో ఒకరికి కలవాలి అనే కోరిక కలిగింది. దీనికి సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకున్నారు...

Twins: పుట్టగానే విడిపోయారు, 30 ఏళ్ల తర్వాత కలిశారు.. అక్కాచెల్లెల్ని కలిపిన..
Twins
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Feb 04, 2024 | 5:45 PM

వారిద్దరు అనాథలు అందులో అక్కచెల్లెలు దానికి తోడు పుట్టగానే విడిపోయారు మళ్లీ కలుస్తారని అస్సలు అనుకోలేదు. అలాంటి ఆలోచన వచ్చే వయసు కూడా విడిపోయే సమయంలో వారికి లేదు కానీ సోషల్ మీడియా రూపంలో ఆ దేవుడు వారిద్దరిని మళ్లీ ఒకటి చేశాడు. అసలు ఎవరు వారిద్దరూ ఏంటి ఆ కహాని.? ఎలా కలిశారు? అనే విషాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

వివరాల్లోకి వెళితే.. వారిద్దరూ నాన్ ఐడెంటికల్ కవలలు అంటే ఎలాంటి పోలికలు లేని ట్విన్స్ అన్నమాట. ఇండోనేషియాలోని ఒక అనాథాశ్రమంలో పుట్టిన వెంటనే చెరొక ఇంటికి దత్తత వెళ్లడంతో విడిపోయారు. అయితే కొన్నేళ్ల తరువాత ఆ ఇద్దరిలో ఒకరికి కలవాలి అనే కోరిక కలిగింది. దీనికి సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకున్నారు. దీనికి సోషల్ మీడియా సహకరించడంతో ఏళ్ల తర్వా మళ్లీ కలిశారు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు వారి పేర్లు లిన్ బ్యాక్ మాన్, ఎమిలీ ఫాల్క్ చిన్నప్పుడే స్వీడిష్ కుటుంబాలు దత్తత తీసుకోగా, కొన్ని రోజులకు ఆ రెండు కుటుంబాల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా పోయింది.

కానీ ఒక 30 ఏళ్లకు లిన్ అక్క ఫాల్క్‌కు చెల్లి గుర్తొచ్చింది కలవాలి అనే కోరిక బలంగా పుట్టడంతో వెంటనే ఫేస్‌బుక్‌లో ఇండోనేషియా అనాథ ఆశ్రమంలో స్వీడిష్ కుటుంబాలు దత్తత తీసుకున్న వివరాలతో పాటు వారి కన్న తల్లి పేరు పుట్టినరోజును ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఫాల్క్. ఇంకేముంది.. కొద్దీ రోజులకు లిన్ నుంచి సమాధానం వచ్చింది. ఆ వివరాలు తనవే అని వెంటనే కలుసుకున్న వారిద్దరూ డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నారు.

రిపోర్ట్ కూడా పాజిటివ్‌ రావడంతో వారిద్దరూ అవాక్కయ్యారు దానికి తోడు వారి నివాసాల మధ్య కేవలం 40 కిలోమీటర్ల దూరమే ఉండటం విశేషం. ఇక ఏడాది వేరయిన వీరిద్దరూ ఒకే తేదీన పెళ్లి చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ టీచర్‌ వృత్తిలోనే ఉండడం ఆశ్చర్యం. వినడానికి ఇదంతా సినిమా స్టోరీల అనిపించినా ఇది నిజ జీవితంలో జరిగిన నిజమైన కథ.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles