Optical Illusion: ఈ ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.. దీనిబట్టి మీరేంటో తెలుసుకోవచ్చు
మనం ప్రపంచాన్ని చూసే దృక్కోణమే మనమెంటో చెబుతోందని మానసిక నిపుణులు అంటారు. ఒక వస్తువు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. దీనిబట్టే మన వ్యక్తిత్వం ఏంటో అంచనా వయొచ్చని చెబుతుంటారు. మానసిక నిపుణులు ఇందుకోసం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను ఎంచుకుంటారు. ఈ ఫొటోలను చూపించడం ద్వారా మనిషి ఆలోచనలను అంచనా వేస్తారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలో కనిపించే అంశాల ఆధారంగా మనిషి […]

మనం ప్రపంచాన్ని చూసే దృక్కోణమే మనమెంటో చెబుతోందని మానసిక నిపుణులు అంటారు. ఒక వస్తువు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. దీనిబట్టే మన వ్యక్తిత్వం ఏంటో అంచనా వయొచ్చని చెబుతుంటారు. మానసిక నిపుణులు ఇందుకోసం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను ఎంచుకుంటారు. ఈ ఫొటోలను చూపించడం ద్వారా మనిషి ఆలోచనలను అంచనా వేస్తారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలో కనిపించే అంశాల ఆధారంగా మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు. అతని మనస్తత్వం ఎలా ఉందన్న విషయాలను అంచనా వేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూడగానే మొదట కనిపిస్తుందన్న అంశం ఆధారంగా ఆ వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

పైన ఫొటో చూడగానే ఒక తెల్లటి ఆకారం కనిపిస్తోంది కదూ! ఈ ఫొటో చూడగానే ఒక వ్యక్తి చేయి పైకి ఎత్తినట్లు కనిపిస్తోంది కదూ. అయితే ఇందులో మరో ఆకారం కూడా దాగి ఉంది. ఒక వ్యక్తి అరుస్తున్నట్లు ఉన్న ఆకారం సైతం ఇందులో కనిపిస్తోంది. అయితే ఈ రెండు ఆకారాల్లో మొదట ఏం కనిపిస్తుందన్న ఆధారంగా మన వ్యక్తిక్తం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
* ఒకవేళ ఫొటో చూడగానే అరుస్తున్న మనిషి ముఖం కనిపించినట్లైతే మీరు లోతైన ఆలోచన ధోరణిని కలిగిఉన్నారని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఆత్మపరిశీలనలో మునిగిపోతారు. ఇలాంటి వ్యక్తులు ప్రతీ అంశాన్ని దీర్ఘంగా ఆలోచిస్తారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకునే వారకు వదిలి పెట్టరు.
* ఒకవేళ ఈ ఫొటో చూడగానే మీకు పైకెత్తిన చేయి కనిపిస్తే.. ఇలాంటి వ్యక్తులు సమస్యలను చాలా త్వరగా పరిష్కరిస్తారు. ఏ సమస్య ఎదురైనా తెలివితో సాల్వ్ చేస్తారు. ఈ వ్యక్తులకు సవాళ్లను స్వీకరించే అలవాటు ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
