పల్లె వెలుగు బస్సుపై కుప్పకూలిన విద్యుత్ స్తంభం.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..!
గుంటూరు జిల్లాలో ఏపీ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుండి టెంపుల్ అమరావతికి పల్లె వెలుగు బస్సు వెళుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడం మొదలైంది. గుంటూరు నుండి వివిధ బస్టాపుల్లో ముప్పై ఐదు మంది వరకూ ప్రయాణీకులు బస్సు ఎక్కారు.

గుంటూరు జిల్లాలో ఏపీ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుండి టెంపుల్ అమరావతికి పల్లె వెలుగు బస్సు వెళుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడం మొదలైంది. గుంటూరు నుండి వివిధ బస్టాపుల్లో ముప్పై ఐదు మంది వరకూ ప్రయాణీకులు బస్సు ఎక్కారు. ఏపి 39యుజెడ్ 5677 నంబర్ గల పల్లె వెలుగు బస్సు వర్షం పడుతుండటంతో నెమ్మదిగా వెళుతోంది. బస్సు అమరావతి మండలం యండ్రాయి చేరుకునే సరికి గాలి కూడా మొదలైంది. గాలి హోరుకు చింత చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విద్యుత్ వైర్లపై పడింది. వైర్లపై పడటంతోనే షార్ట్ సర్క్యూట్ అయి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బస్సు నెమ్మదిగా వెళ్తుండటంతో వైర్లు తెగిపోయిన స్తంభం ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుపై పడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిచిపివేశాడు. డ్రైవర్ కు వెంటనే ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం బస్సుపై పడినట్లు గుర్తించాడు. స్తంభం బస్సుపై పడటంతోనే ప్రయాణీలకు భయాందోళనకు గురయ్యారు. ముప్పై ఐదు మంది ప్రయాణీకులు హాహాకారాలు చేస్తూ బ్రతుకు జీవుడా అంటూ బస్సు నుండి దిగిపోయారు. బస్సు దిగిన ప్రయాణీకులు ఆ సీన్ చూసి మరింత కంగారు పడ్డారు. విద్యుత్ వైర్లు తెగిపోయిన వెంటనే కరెంటు నిలిచిపోవడం, ఆపై విద్యుత్ స్తంభం పడినా విద్యుత్ సరఫరా జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఈ విషయాన్ని వెంటనే ప్రయాణీకులు పోలీసులకు, విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్ స్తంభాన్ని తొలగించి, ప్రయాణీకు అక్కడ నుండి అమరావతికి తరలించారు. కొద్దిసేపటి వరకూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




