Alluri District: పాపం..రెండు రోజులుగా బావిలోనే..! ఎట్టకేలకు ప్రాణం కాపాడారు..
Andhra Pradesh: 30 అడుగులబావి లో ఓ ఆవు దూడ పడిపోయింది. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, ఆకలి తో నిరసించి పోయింది. రెండు రోజుల పాటు అందులోనే ఉండిపోయింది. ఆ బావిలో నీరు లేకపోవడంతో తీసే వారి సహాయం కోసం ఎదురుచూసింది ఆ దూడ. దాని పరిస్థితి మరింత దీనంగా మారింది. ఆవు దూడ బావిలో పడిపోయింది అన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు.. మూడు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు.
అది ఏజెన్సీ ప్రాంతం.. మేత కోసం వెళ్ళింది ఆ మూగ జీవం. దారి మధ్యలో ఉన్న ఓ బావిలో పడిపోయింది ఆవు. బయటకు రావాలంటే.. ముప్పై అడుగుల బావి. పోనీ లోపల ఉండాలంటే ఆహారం లేదు. ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. గాయాలు, ఆకలి తో నిరసించి పోయింది. ఇక ఓ గ్రామాస్తుడు చూసి స్థానికులకు సమాచారమిచచ్చాడు. దింతో.. మూడు గంటలు కష్టపడ్డారు.
– అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాన్ని రక్షించారు స్థానికులు. మూడు గంటల పాటు శ్రమించి ఆవు దూడను బయటకు తీశారు. పెదబయలు మండలం గోమంగిలో ఈ ఘటన జరిగింది.
– పెదబయలు మండలం గోమంగి సరియపల్లి కాలనీ 30 అడుగులబావి లో ఓ ఆవు దూడ పడిపోయింది. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, ఆకలి తో నిరసించి పోయింది. రెండు రోజుల పాటు అందులోనే ఉండిపోయింది. ఆ బావిలో నీరు లేకపోవడంతో తీసే వారి సహాయం కోసం ఎదురుచూసింది ఆ దూడ. దాని పరిస్థితి మరింత దీనంగా మారింది. ఆవు దూడ బావిలో పడిపోయింది అన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు.. మూడు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. మూగజీవిని రక్షించడానికి శ్రమించిన యువకులు ప్రతాప్ చంద్, కూడ ప్రసాద్, కూడ సిసింద్రీ, కూడ కొండబాబు, కుంబిడి వెంకటరమణ, ప్రభాకర్ కుంబిడి జయరాజ్ లను అభినందించారు గ్రామస్థులు . దూడకు సపర్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..