Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న మన్మధుడు.. మరోమారు అమ్మాయిలను మాయచేస్తున్నాడు..!

హైదరాబాద్ లో ఏ సినిమా విడుదలైన ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్, దేవి థియేటర్లో, కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో ఫ్యాన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు కూడా మన్మధుడు సినిమా మళ్లీ విడుదల చేయడంతో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్, దేవీ థియేటర్లలో నాగార్జున ఫ్యాన్స్ తమ హీరో బ్యానర్ కు పాలాభిషేకం చేస్తూ వారి అభిమానం చాటుకున్నారు.

డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న మన్మధుడు.. మరోమారు అమ్మాయిలను మాయచేస్తున్నాడు..!
Manmadhudu Re Release
Follow us
S Navya Chaitanya

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 29, 2023 | 4:04 PM

ఈ మధ్యకాలంలో పాత సినిమాలు మళ్ళీ థియేటర్లో చూడటమొక ట్రెండ్. గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. ఒకప్పుడు చూసిన సినిమాలు మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ అయినప్పుడు, తమ ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ ని ఒకప్పటి యాక్టింగ్ చూసేందుకు తెగ సంబర పడిపోతుంటారు ప్రేక్షకులు. గతంలో థియేటర్లలో మిస్సయిన సినిమాలు మళ్లీ థియేటర్లో చూసే అవకాశం లభిస్తే ఆ ఆనందమే వేరు. స్టార్ హీరోల పుట్టినరోజులు కారణంగా కొన్ని సినిమాలు రీ-రెలీజ్ చేస్తున్నారు. కొత్త సినిమా కన్నా పాత సినిమాలే తెగ ఎగబడి చూస్తున్నారు ప్రేక్షకులు.

తాజాగా మన్మధుడు సినిమా రిలీస్ అయింది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లోని పలుచోట్ల మన్మధుడు సినిమా రీ-రెలీజ్ చేయడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. హైదరాబాద్ లో ఏ సినిమా విడుదలైన ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్, దేవి థియేటర్లో, కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో ఫ్యాన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు కూడా మన్మధుడు సినిమా మళ్లీ విడుదల చేయడంతో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్, దేవీ థియేటర్లలో నాగార్జున ఫ్యాన్స్ తమ హీరో బ్యానర్ కు పాలాభిషేకం చేస్తూ వారి అభిమానం చాటుకున్నారు.

మన్మధుడు సినిమాలోని “DONT MARRY BE HAPPY” అనే పాట ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే. ఇక ఆ పాట ఈ జనరేషన్లో అది కూడా థియేటర్లలో ప్లే అవ్వడం అంటే ఇక థియేటర్లలో సందడి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట రావడంతోనే ఒక్కసారిగా థియేటర్ లోనీ ప్రేక్షకులు అంతా ఆ పాటని పాడుతూ, అరుస్తూ, పేపర్లు ఎగరవెస్తు ఉర్రూతలూగారు. ఇక సినిమా అయిపోయి బయటికి వచ్చాక కొన్ని థియేటర్ల వద్ద కేక్ కటింగ్ చేశారు. మొత్తానికి అక్కినేని నాగార్జున పుట్టినరోజు కారణంగా వారి సినిమా మన్మధుడు రీ-రిలీజ్ అవడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.