Passengers Weight: విమానం ఎక్కే ముందు మీ బరువు చూసుకోండి.. ఇప్పుడు మరో ఎయిర్‌ లైన్స్‌ కీలక ప్రకటన

ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు గింపో అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించబడింది. అలాగే సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులను ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో అసౌకర్యంగా ఉన్న ప్రయాణీకుల కోసం, ప్రయాణీకుల సామాను రెండూ అనామకంగా తూకం వేయబడతాయని విమానయాన సంస్థ తెలిపింది.

Passengers Weight: విమానం ఎక్కే ముందు మీ బరువు చూసుకోండి.. ఇప్పుడు మరో ఎయిర్‌ లైన్స్‌ కీలక ప్రకటన
Passengers Weight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2023 | 2:34 PM

విమానం ఎక్కే ముందు మన లగేజీ బరువును చెక్ చేసుకోవడం అందరికీ తెలిసిందే.  విమాన ప్రయాణీకుల లగేజ్‌ ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవలసి వస్తుంది. లేదంటే, కొన్ని సందర్భాల్లో పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది. కానీ, ఇక నుంచి ఈ ఫ్లైట్ ఎక్కే ముందు మీ లగేజీ బరువు మాత్రమే కాదు,.. మీ బరువు కూడా చెక్ చేసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే.. ఎయిర్ న్యూజిలాండ్ తర్వాత ఇప్పుడు మరో అతిపెద్ద విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియా అతిపెద్ద విమానయాన సంస్థ అయిన కొరియన్ ఎయిర్‌లో ప్రయాణించే ప్రయాణీకులు ఫ్లైట్ ఎక్కే ముందు తమ బరువు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొరియన్ ఎయిర్ తన వెబ్‌సైట్‌లో విమాన భద్రత కోసం వారి క్యారీ-ఆన్ వస్తువులతో పాటు ప్రయాణీకుల సగటు బరువును కొలవాల్సి ఉంటుందని ధృవీకరించింది.

ఈ ప్రక్రియ ఆయా విమానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ లెక్కలు అవసరం. గేట్ల ముందు, ఫ్లైట్‌ ఎక్కే ముందు బరువు పరీక్ష నిర్వహించబడుతుందని కొరియా టైమ్స్ నివేదించింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు గింపో అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించబడింది. అలాగే సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులను ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో అసౌకర్యంగా ఉన్న ప్రయాణీకుల కోసం, ప్రయాణీకుల సామాను రెండూ అనామకంగా తూకం వేయబడతాయని విమానయాన సంస్థ తెలిపింది.

మొత్తం డేటాను సేకరించిన తర్వాత అది కొరియా భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేయబడుతుంది. విమానయాన సంస్థలు తమకు ఎంత ఇంధనం అవసరమో, విమానంలో బరువును ఎలా షేర్‌ చేయాలో నిర్ణయించడంలో సహాయపడుతుందన్నారు. అంతేగానీ, అధిక బరువు ఉన్న ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని దీని అర్థం కాదు అని ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ ఏడాది జులైలో ఎయిర్ న్యూజిలాండ్ ఈ ప్రక్రియను తొలిసారిగా అమలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..