Watch Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. 295 అడుగుల ఎత్తులో వేలాడుతున్న టేబుల్‌పై డిన్నర్‌.. కాస్త అటు ఇటు అయితే..

కేబుల్స్, వైర్ల సహాయంతో వారిని కట్టివేసినప్పటికీ ప్రాణాంతకమైన సహసామే అంటున్నారు. ఇది కేబుల్ కార్ లాంటి అనుభవం. ఒకే తేడా ఏమిటంటే కారు క్లోజ్‌ చేసి ఉంటుంది. కానీ,మొత్తం అంతా ఓపెన్‌గానే కనిపిస్తుంది. ఇక్కడ 15 నిమిషాలు వేలాడదీయడానికి, మీరు $ 450 అంటే భారతీయ కరెన్సీలో 37 వేల రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేయాలి.

Watch Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. 295 అడుగుల ఎత్తులో వేలాడుతున్న టేబుల్‌పై డిన్నర్‌.. కాస్త అటు ఇటు అయితే..
Highest Waterfall Dining
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2023 | 4:23 PM

Highest Waterfall Dining: వెర్రీ వెయ్యి విధాలు అంటారు.. ఇలాంటి పెద్దల మాటలను నిజం చేస్తూ నేటి తరం యువతి యువకులు ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. వారు చేసే పనులు చూస్తుంటే.. నిజంగానే వీరికి వెర్రీ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల పేరుతో పెళ్లి చేసుకోబోతున్న జంటలు చేసే కొన్ని పనులు అలాగే ఉంటున్నాయి. అంతేకాదు.. చాలా మంది ఎలాంటి జంకు, భయం లేకుండా ప్రవర్తిస్తుంటారు.  అయితే, ప్రతి మనిషికి భయం ఉంటుంది. ప్రతి ఒక్కరి భయానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు. కొందరు చీకటికి భయపడతారు. మరికొందరు ఎత్తులకు భయపడతారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, చాలా మంది తమ జీవితమంతా భయంతో జీవిస్తారు. అయితే, దానిని అధిగమించేందుకు కొందరు తమను తాము సవాలు చేసుకుంటారు. ఇది వారు దేనికి భయపడాలి. దేనికి భయపడకూడదు అనే ఆలోచనతో ఉంటారు.. అయితే, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయం వస్తుంది. అప్పుడే వారిలోని భయం పోతుంది. అలాంటి ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో (@jetblacktravel) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది. ఇది క్యాప్షన్‌లో ఇలా రాశారు.. ఇది నెక్ట్స్‌ లెవల్‌ ..మీరు కూడా ప్రయత్నించాలనుకుంటున్నారా? నివేదిక ప్రకారం, ఈ క్లిప్ బ్రెజిల్‌కు సంబందించినదిగా తెలిసింది. ఇక్కడ ఒక జంట 295 అడుగుల ఎత్తులో గాలిలో ఊగుతూ కనిపించటం వైరల్ క్లిప్‌లో చూడవచ్చు. ఆ పక్కనే జలపాతం ప్రవహిస్తోంది. ఇద్దరూ టేబుల్ మీద ఫుడ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని స్నాక్స్ , రెడ్ వైన్ గ్లాసు టేబుల్ మీద కనిపిస్తున్నాయి. భద్రత కోసం ఇద్దరూ తాడుతో కట్టుకున్నారు. ఆగస్టు 20న షేర్ చేసిన ఈ ఈ వీడియోకి ఇప్పటికే 12 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో, వినియోగదారులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఫ్రీగా కూడా ఈ సాహసం చేయకూడదని చాలా మంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అలాంటి ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఆపద కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు చాలా మంది నెటిజన్లు. కేబుల్స్, వైర్ల సహాయంతో వారిని కట్టివేసినప్పటికీ ప్రాణాంతకమైన సహసామే అంటున్నారు. ఇది కేబుల్ కార్ లాంటి అనుభవం. ఒకే తేడా ఏమిటంటే కారు క్లోజ్‌ చేసి ఉంటుంది. కానీ,మొత్తం అంతా ఓపెన్‌గానే కనిపిస్తుంది. ఇక్కడ 15 నిమిషాలు వేలాడదీయడానికి, మీరు $ 450 అంటే భారతీయ కరెన్సీలో 37 వేల రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేయాలి.

కాబట్టి మీకు గుండె ధైర్యం ఎక్కువ అనుకుంటే.. మీరు ఇలాంటి ఎత్తులకు భయపడకపోతే, మీరు కూడా ఇలాంటి ప్రదేశానికి వెళ్లేందుకు రెడీ అవ్వండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..