AP News: ఏపీ, తెలంగాణ బోర్డర్ మీదుగా ప్రయాణిస్తున్న వారికి ముఖ్య గమనిక.. ఇకపై.!
ఏపీ, తెలంగాణ బోర్డర్ మీదుగా ప్రతీరోజూ ప్రయాణిస్తున్న వారికి ముఖ్య గమనిక ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు. ఇకపై సరిహద్దు చెక్‌పోస్టులో నగదు చెల్లింపులు.. ఈ విధంగా ఉండాలని అంటున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో.? ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..?
అమరావతి, ఆగష్టు 29: ఏపీ ప్రభుత్వం వినూత్నంగా మార్పులు తీసుకొస్తోంది. దీనిలో భాగంగా అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కటిగా ప్రతి శాఖలోనూ మార్పులు చేస్తూ.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల దగ్గర ఆన్‌లైన్ లావాదేవీలు ప్రవేశపెట్టింది. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నగదు రహిత విధానం అమలు చేసింది. చెక్ పోస్టుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి క్యూ-ఆర్ స్కాన్ కోరుతూ లావాదేవిలు సాగిస్తున్నారు ప్రయాణికులు.
రాష్ట్ర రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు రవాణా శాఖకు సంబంధించిన సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద.. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్, వాలంటరీ ట్యాక్స్, అపరాధ రుసుము మొదలగు.. చెల్లింపులు ఈ https://aprtacitizen.epragathi.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి.. క్యూర్ ఆర్ స్కానర్ ద్వారా రవాణా శాఖకు పూర్తిగా నగదు-రహిత విధానంలోనే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా తమకు డబ్బుల చెల్లింపు మరింత సులభతరం అయిందని కొందరు డ్రైవర్లు తెలపగా.. మరికొందరు ఆన్‌లైన్ చెల్లింపునకు కొంచెం ఇబ్బంది పడుతుండటంతో.. సరిహద్దు చెక్‌పోస్టు దగ్గర ఉన్న సిబ్బంది వారికి అవగాహన కల్పిస్తూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయిస్తున్నారు.
కాగా, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ రావడంతో చెక్‌పోస్ట్ వద్ద హడావుడి కనిపించడం లేదు. గతంలో ఇక్కడ వాహనాలు బార్లు తీరేవి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి అయినా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా నగదు చెల్లించవచ్చని.. దీంతో నగదు చెల్లింపు సులభతరంగా మారిందని డ్రైవర్లు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే అక్కడ ఉన్న సిబ్బందికి మాత్రం ఎలాంటి పని దొరకపోవడంతో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అవినీతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్‌తో వాహనదారులు తమ స్మార్ట్ ఫోన్‌లలో పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌ని ఉపయోగించి రోడ్డు పన్ను, ఇతర రుసుములను చెల్లించడానికి అనుమతిస్తుంది. ఇది నగదు చెల్లింపుల అవసరాన్ని తొలగిస్తుంది. ఫిబ్రవరి 2023లో ఆంధ్రప్రదేశ్‌లోని 15 అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద UPI చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..