AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చచ్చి దెయ్యమై పీడిస్తా.. 11 పేజీల లెటర్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం.. చివరకు..

మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని, కొద్ది కాలంగా కళాశాలకు వెళ్లటం మానేసింది. చివరకు ఆ విద్యార్థిని నిన్న ఉదయం కళాశాల నాలుగోవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కలశాల బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. క్లాస్‌లో టాపర్ అయిన యువతి విజయవాడ అంబాపురంలో..

Andhra Pradesh: చచ్చి దెయ్యమై పీడిస్తా.. 11 పేజీల లెటర్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం.. చివరకు..
Inter Girl Suicide
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Aug 29, 2023 | 3:12 PM

Share

విజయవాడ, ఆగస్టు 29: ఆమె క్లాస్‌లో టాపర్.. ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. దీంతో చదువుకుంటే బాగుపడతావు.. ఏదో ఒక ఉద్యోగం వస్తుందమ్మా.. మా అందర్ని నువ్వు మంచిగా చూసుకోవచ్చు.. అంటూ తల్లిదండ్రులు ఆమెను కాలేజీలో చేర్పించారు. ఇప్పుడు సెకండియర్ చదువుతోంది. అయితే, ఆ యువతి ఇంటి దగ్గర ఉన్న ఓ అబ్బాయిని ప్రేమించింది. చివరకు ప్రేమలో విఫలం అయ్యి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని ప్రేమిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని, కొద్ది కాలంగా కళాశాలకు వెళ్లటం మానేసింది. చివరకు ఆ విద్యార్థిని నిన్న ఉదయం కళాశాల నాలుగోవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కలశాల బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. క్లాస్‌లో టాపర్ అయిన యువతి విజయవాడ అంబాపురంలో ఉంటూ ఓ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొద్దీ రోజులుగా కళాశాలకు రావటం మానేసిన ఆ యువతి.. నిన్న ఉదయం కళాశాలకు వెళ్లింది. క్లాస్ 8 గంటలకైతే 6 గంటలకే వాకర్స్ తో కాలేజ్‌లోకి ప్రవేశించింది. అనంతరం 4వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. యువతిని గమనించిన వాకర్స్ ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కళాశాల భవనంపై నుంచి దూకటంతో తీవ్ర గాయాలైన ఆ యువతి కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటలైతే కానీ కండిషన్ చెప్పలేమని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.

అయితే, ఆ యువతి ఆత్మహత్యకు ప్రేమలో విఫలం అవ్వటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంటి దగ్గరే ఉన్న యువకుడిని ఆ అమ్మాయి ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొంత కాలంగా ఆ యువకుడు మరో యువతిని ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలిసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి కాలేజ్ కు వెళ్ళటం మానేసింది. దిగులుగా ఆరోగ్యం బాగోలేక ఇంటి వద్దే ఉంటూ.. నిన్న చనిపోవాలనుకుని 11 పేజీల సూసైడ్ నోట్ కూడా రాసింది.

ప్రేమలో విఫలం అయ్యాను నేను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని ప్రేమిస్తున్నాడు, నాకు చదువుపై ఇంట్రెస్ట్ లేదు, నా తప్పు లేకున్నా ఇంట్లో నన్నే నిందిస్తున్నారంటూ ఆమె ఆవేదనను ఆ లేఖలో ప్రస్తావించింది. నన్ను ఇబ్బంది పెట్టిన వారిని చనిపోయి దెయ్యమై పీడిస్తానంటూ లేఖలో హెచ్చరించింది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..