Andhra Pradesh: పట్టపగలే రెచ్చిపోతున్న ఎలుగబంట్లు.. భయంతో అల్లాడిపోతున్న ఉద్ధానం ప్రజలు..

Andhra Pradesh: పట్టపగలే రెచ్చిపోతున్న ఎలుగబంట్లు.. భయంతో అల్లాడిపోతున్న ఉద్ధానం ప్రజలు..

Shiva Prajapati

|

Updated on: Aug 29, 2023 | 2:19 PM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధాన ప్రాంతం అంటే ఎలుగు బంట్ల సంచారం సహజం. అయితే ఒకప్పుడు కొండలు, గుట్టలు, తోటల్లో ఉండే ఎలుగుబంట్లు ఇటీవల రాత్రిపూట జనావాసాలలోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఇప్పుడైతే ఏకంగా పట్టపగలే గ్రామాల్లోకి వస్తూ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలోకి ఆగస్టు 28న మధ్యాహ్నం ఎలుగుబంటి చొరబడింది. వీధుల్లో ఎదేచ్చగా తిరుగుతూ హల్ చల్ చేసింది. భయంతో గ్రామస్తులు కేకలు వేస్తూ తరిమి వేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. సుమారు గంటపాటు గ్రామ వీధుల్లో సంచరిస్తూ గ్రామస్థులను హడలెత్తించింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధాన ప్రాంతం అంటే ఎలుగు బంట్ల సంచారం సహజం. అయితే ఒకప్పుడు కొండలు, గుట్టలు, తోటల్లో ఉండే ఎలుగుబంట్లు ఇటీవల రాత్రిపూట జనావాసాలలోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఇప్పుడైతే ఏకంగా పట్టపగలే గ్రామాల్లోకి వస్తూ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలోకి ఆగస్టు 28న మధ్యాహ్నం ఎలుగుబంటి చొరబడింది. వీధుల్లో ఎదేచ్చగా తిరుగుతూ హల్ చల్ చేసింది. భయంతో గ్రామస్తులు కేకలు వేస్తూ తరిమి వేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. సుమారు గంటపాటు గ్రామ వీధుల్లో సంచరిస్తూ గ్రామస్థులను హడలెత్తించింది. ఇంటింటికి తిరిగుతూ ఆహారం కోసం వెతుకుతూ కంగారెత్తించింది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఇళ్ళ నుండి బయటకు రాడానికి భయపడిపోయారు. ఇటీవల తరచూ ఎలుగుబంట్లు ఇలా గ్రామాల్లోకి వస్తుండటంతో తీవ్ర అవేదనకు గురవుతున్నారు. ఏక్షణం ఎవరిపై దాడిచేస్తుందోనని హడలిపోతున్నారు. ఎలుగుబంట్లు బారినుంచి తమకు రక్షణ కల్పించాలని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Published on: Aug 29, 2023 02:18 PM