Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా.. ఎంత పొడవుందో చూస్తే గుండె జారిపోవడం ఖాయం..

అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ సమీప కొండలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లోకి గిరి నాగులు కలకలం సృష్టిస్తున్నాయి. పొలాలు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. మాడుగుల, దేవరపల్లి, చీడికాడ మండలాల్లో.. ఎక్కడో ఒక చోట కింగ్ కోబ్రాలు దర్శనమిస్తుండడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి సర్వసాధారణంగా మనిషి జోలికి రాదు కింగ్ కోబ్రా. ఎదురు తిరిగి నిటారుగా నిలుచుని కాటేస్తే..

Andhra Pradesh: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా.. ఎంత పొడవుందో చూస్తే గుండె జారిపోవడం ఖాయం..
King Cobra
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 06, 2023 | 1:17 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయం భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా ఏపీలో గ్రామాల్లో పరిస్థితి దారుణం అని చెప్పొచ్చు. దీనికి కారణం సర్పాలే. అవును, వర్షాకాలం కావడంతో అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ సమీప కొండలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లోకి గిరి నాగులు కలకలం సృష్టిస్తున్నాయి. పొలాలు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. మాడుగుల, దేవరపల్లి, చీడికాడ మండలాల్లో.. ఎక్కడో ఒక చోట కింగ్ కోబ్రాలు దర్శనమిస్తుండడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి సర్వసాధారణంగా మనిషి జోలికి రాదు కింగ్ కోబ్రా. ఎదురు తిరిగి నిటారుగా నిలుచుని కాటేస్తే.. క్షణాల్లో కుప్పకూలి ప్రాణాలకు పోవడం ఖాయమే..! తాజాగా ముకుందపురంలో.. భారీ గిరినాగును చూసి గ్రామస్తులంతా గుండెలు పట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో కనిపించిన గిరినాగుల్లో ఇది అత్యంత పొడవైనది, బరువైనది కావడం విశేషం. అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు కలకలం రేపింది. పట్టుకునేందుకు ప్రయత్నిస్తే భుసలు కొడుతూ ఎదురు తిరిగింది. దీంతో అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలేశారు స్నేక్ సొసైటీ సభ్యులు.

జిల్లాలోని దేవరాపల్లి మండలం తామరబ్బా పంచాయతీ శివారు ముకుందపురం గ్రామంలోని పంట పొలంలోకి భారీ గిరినాగు వచ్చేసింది. దానిని చూసిన ఓ రైతులు హడలిపోయాడు. అక్కడి పరుగులు తీసి గ్రామస్తులకు అంతా హడాలెత్తిపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించిన గిరినాగుల్లో ఇది అత్యంత పొడవైనది.

దాని పొడవు ఎంతుందంటే..

దాదాపు 15 నుంచి 16 అడుగుల పొడవైన గిరి నాగు జనావాసాల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు గ్రామస్తులు. వన్యప్రాణుల సంరక్షణ సభ్యులకు కూడా విషయాన్ని చేరవేశారు. రంగంలోకి దిగిన వాళ్లంతా.. గిరి నాగును పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. సాధారణం కంటే ఇది అత్యంత పొడవుగా ఉండడంతో దాన్ని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఎదురు తిరుగుతూ బుసలు కొట్టింది. ఒకవైపు గ్రామస్తులంతా గుమి గూడారు.. మరోవైపు బుసలు కొట్టే గిరినాగును పట్టుకోవడం అత్యంత కష్టంగా మారింది. ఎందుకంటే పట్టు తప్పితే కాటేయడం ఖాయం. చాలాసేపు శ్రమంచి, అత్యంత చాకచక్యంగా ఆ గిరినాగును బంధించారు స్నేక్ క్యాచర్స్. అనంతరం సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

వామ్మో బరువు అంతా..?!

ఇది పొడవుకు తగ్గటగానే బరువు కూడా ఉంది. దాదాపుగా 13 కిలోల బరువు ఉన్నట్టు చెబుతున్నారు చోడవరం ఫారెస్ట్ రేంజర్ రవి వర్మ. జతకట్టే సీజన్ కావడంతో తరచూ గిరి నాగులు బయటకు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. భారీ కాయంలో ఉన్న ఈ గిరి నాగును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కింగ్ కోబ్రా వీడియోలను ఇక్కడ చూడొచ్చు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..