Amaravati: ఫార్మసీ కోర్సులకు ఫీజుల నిర్దారణ.. ఏ కోటా ఫీజు ఎంతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ ,పర్యవేక్షణ మండలి నిర్ణయించిన ఫీజులతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.ప్రైవేట్ కళాశాలలతో పాటు అన్ ఎయిడెడ్ మైనారిటీ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి.ప్రతి మూడేళ్లకోసారి కళాశాలలవారీగా ఉన్న వసతులు, టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి ఇస్తున్న జీతాలు,ఇతర ఖర్చులను ప్రభుత్వానికి..
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఫార్మసీ కోర్సులకు ఫీజులు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.బీ ఫార్మసీ,ఎం. ఫార్మసీ,ఫార్మా-డి తో పాటు ఫార్మా(పీబీ) కోర్సులకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ ,పర్యవేక్షణ మండలి నిర్ణయించిన ఫీజులతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.ప్రైవేట్ కళాశాలలతో పాటు అన్ ఎయిడెడ్ మైనారిటీ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి.ప్రతి మూడేళ్లకోసారి కళాశాలలవారీగా ఉన్న వసతులు, టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి ఇస్తున్న జీతాలు,ఇతర ఖర్చులను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.దీని ప్రకారం కళాశాలలు ఇచ్చిన నివేదికలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఫీజులపై ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ మండలి ఫీజులను ఖరారు చేయనుంది.
మూడేళ్లకు ఫీజులు ఎక్కడెక్కడ ఎంత?
2023-24 విద్యాసంవత్సరం నుంచి 2025-26 వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి.మొత్తం 177 బి-ఫార్మాసీ కళాశాలల్లో ఏడాదికి కనీస ఫీజు 38 వేలు రూపాయలుగాను,గరిష్ట ఫీజును 80 వేల రూపాయలుగా నిర్ణయించారు .మరోవైపు 102 ఎం.ఫార్మసీ కళాశాలల్లో ఏడాదికి కనీస ఫీజు 56వేల800 రూపాయలుగా,గరిష్టంగా 90 వేలుగా నిర్ణయించారు.ఇక ఫార్మా-డి కోర్సు ఉన్న 62 కళాశాలల్లో ఒక సంవత్సరానికి కనిష్ట ఫీజు 38 వేలు,గరిష్ట ఫీజు 65 వేలుగా నిర్ణయించారు అధికారులు. ఫార్మా(పీబీ) కోర్సులకు ఏడాదికి కనిష్ట ఫీజు 42 వేలు,గరిష్ట ఫీజు 80 వేలుగా నిర్ధారించింది ప్రభుత్వం.
బి-కేటగిరీ,ఎన్నారై కోటా ఫీజులు ఎంతంటే?
మూడేళ్ల కొరకు నిర్ణయించిన ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం సూచించింది.ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే డోనేషన్లు,ఇతర ఫీజుల రూపంలో విద్యార్థులు నుంచి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే యాజమాన్య కోటాలో ఉన్న 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లు ఎన్నారై కోటా కింద భర్తీ చేసుకోవచ్చు.ఎన్నారై కోటా సీట్ల ఫీజు 5000 డాలర్ల గా నిర్ణయించింది.మిగిలిన 15 శాతం సీట్లను కన్వీనర్ కోటా ఫీజుల కంటే మూడు రెట్లు అదనంగా ఫీజులను వసూలు చేసుకోవచ్చని సూచించింది.ప్రతి కళాశాల ఫీజుల విషయంలో సరైన డాక్యుమెంట్స్ ను నిర్వహించాలని స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..