Andhra Pradesh: గంజాయి కోసం టెన్త్ విద్యార్ధి కిడ్నాప్‌..! సినీఫక్కీలో రాత్రికి రాత్రే సీన్ రివర్స్

గంజాయి కోసం ముగ్గురు వ్యక్తులు ఏకంగా పదో తరగడి పోరగాడ్ని ఎత్తెకెళ్లారు. అనంతరం రూ. లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా అదే రోజు రాత్రి మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది..

Andhra Pradesh: గంజాయి కోసం టెన్త్ విద్యార్ధి కిడ్నాప్‌..! సినీఫక్కీలో రాత్రికి రాత్రే సీన్ రివర్స్
10th Class Boy Kidnapped In Chimakurthy
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2024 | 9:33 AM

చీమకుర్తి, డిసెంబర్‌ 1: రాష్ట్రంలో డ్రగ్స్ యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. తాజాగా గంజాయి విషయంలో ముగ్గురు వ్యక్తులకు, ఓ పదో తరగతి విద్యార్ధి మధ్య వివాదం నెలకొంది. అనుకున్న సమాయానికి సరుకు పంపక పోవడంతో ఆ పదో తరగతి విద్యార్థిని ఎత్తుకొచ్చారు. కానీ అదే రోజు రాత్రి వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ప్రకారం జిల్లా వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్‌లు రాష్ట్రంలో గంజాయి వ్యాపారంలో గుండెలు తీసిన బంటులు. దర్జాగా గంజాయి వ్యాపారం సాగిస్తూ అక్రమాలకు పాల్పడేవారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. సదరు విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్‌ వద్ద పని చేస్తుండేవాడు. ఈ విషయం వారికి తెలియడంతో తమకు కూడా గంజాయి కావాలని అడిగారు. వారి మాటలు నమ్మిన ఆ విద్యార్థి తొలి విడత కింద తన బంధువుకు రూ.50 వేలు ఫోన్‌ పే చేయించుకున్నాడు.

కానీ విద్యార్ధి మాత్రం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు తీసుకుని మోసం చేస్తావా అంటూ ఆ విద్యార్థిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం తమకు రూ.లక్ష ఇస్తే విద్యార్ధిని విడిచి పెడతామని బెదిరించారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం బాలుడిని ఎత్తుకెళ్లారు. అద్దె కారులో బాలుడిని ఎక్కించుకుని చీమకుర్తి మీదుగా వినుకొండ తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వినుకొండలోని గాంధీనగర్‌లోని శ్రీనాథ్‌ అనే స్నేహితుడి ఇంటికి బాలుడిని తీసుకెళ్లారు. కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండగా.. ఆ విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశాడు. బాలుడు తెల్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు.

గమనించిన వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంటపడగా రోడ్డుపై ఆటో బోల్తా పడింది. వారిలో యాసిన్‌ పోలీసులకు పట్టుబడగా.. మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి చేరుకుని.. విద్యార్థిని, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. దర్యాప్తులో యాసిన్, సంతోష్, అమీర్‌లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో జైలుకు కూడా వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.