AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నీ ప్రేమ బంగారంగానూ.. ఇదేం పని తల్లీ’ ప్రియుణ్ణి కిడ్నాప్‌ చేసిన ప్రియురాలు! సినీ ఫక్కీలో ఛేజింగ్..

ప్రేమించిన ప్రియుడు తనకు ఎక్కడ దక్కకుండా పోతాడోనని కంగారుపడిన ప్రియురాలు సినీ ఫక్కీలో మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ కారు తీసుకుని ప్రియుణ్ణి అందులో పడేసి కిడ్నాప్ చేసింది. కానీ అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది..

'నీ ప్రేమ బంగారంగానూ.. ఇదేం పని తల్లీ' ప్రియుణ్ణి కిడ్నాప్‌ చేసిన ప్రియురాలు! సినీ ఫక్కీలో ఛేజింగ్..
Girlfriend Kidnaps Boy Friend
Srilakshmi C
|

Updated on: Nov 29, 2024 | 6:36 AM

Share

తిరుపతి, నవంబర్‌ 29: ఓ యువతి.. ఓ యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ మూడు నెలలుగా వారిద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండసాగారు. దీంతో ఆ అమ్మాయిని ప్రేమికుడు దూరం పెట్టసాగాడు. తన ప్రేమ ఎక్కడ చేజారిపోతాడేమోనన్న భయంతో ఆమెలో కంగారు మొదలైంది. ఎలాగైనా తన ప్రేమను పండించుకోవాలని భావించిన యువతి ఏకంగా ప్రియుడి కిడ్నాప్‌కు పన్నాగం పన్నింది. చివరికి పోలీసుల వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో అసలు సంగతి బయటపడటంతో.. నీ ప్రేమ బంగారం గానూ… అంటూ అంతా నోరెళ్లబెట్టారు. సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి పడమర సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకానగర్‌కు చెందిన శ్రీనివాసులు అలియాస్‌ నాని (31) తిరుపతిలో పెద్దకాపు వీధిలోని పార్థ డెంటల్‌ ఆసుపత్రి ఎదురుగా పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్నాడు. అతడు అవివాహితుడు. అతనికి మదనపల్లెకి చెందిన వివాహిత సోనియా భానుతో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె భర్త ఇటీవల చనిపోయాడు. వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో వీరు గత 8 నెలలుగా సన్నిహితంగా ఉండసాగారు.

అయితే ఏం జరిగిందో తెలియదుగానీ మూడు నెలలుగా వారి మధ్య మాటలులేవు. దీంతో నాని ఆమెను పట్టించుకోవం మానేశాడు. శ్రీనివాసులును ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న ఆమె చివరకు అపహరించాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో మదనపల్లెకి చెందిన ఐదుగురు యువకులతో కలిసి ఇన్నోవా కారులో గురువారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి నానిని కిడ్నాప్‌ చేశారు. గమనించిన లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రత్యేక బృందంతో ఛేజింగ్‌ చేసి .. అన్నమయ్య జిల్లా వాయల్పాడు వద్ద వీరి కారును అడ్డగించి నానిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి కిడ్నాపర్‌లు పరార్‌ అయ్యారు. నిందితులు మదనపల్లెకి చెందిన బాబా ఫకృద్దీన్, మోక్షిత్, రాజేష్, రియాజ్, సందీప్‌లుగా గుర్తించారు. నాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.