Telangana: బాబోయ్‌ దండుపాళ్యెం క్రైం సీన్‌! అద్దెల్లు కోసం వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. 

ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దండుపాళ్యెం మువీ స్టైల్లో ఇంటి యజమానులను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని విలువైన సొత్తును దోచుకుని పారిపోయారు. ఈ దరుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

Telangana: బాబోయ్‌ దండుపాళ్యెం క్రైం సీన్‌! అద్దెల్లు కోసం వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. 
Khammam Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2024 | 11:36 AM

ఖమ్మం, నవంబర్‌ 28: ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట ఓ భవంతి ముందు నిలబడ్డారు. ఇంతలో ఇంటి యజమానులు రావడంతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో ఇంటిని అద్దెకు ఇవ్వడానికి యజమానులు అంగీకరించారు. అదే వాళ్ల ప్రాణానికి హాని తలపెట్టింది. వచ్చిన కొత్త మనుషులు అదే రోజు రాత్రి మళ్లీ వచ్చారు. యజమాని ఇంట్లో భోజనం చేసి, దంపతును ఘోరంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు ఖమ్మం జిల్లాలో బుధవారం (నవంబర్‌ 27) ఉదయం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకెళ్తే..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివసిస్తున్న ఎర్రా వెంకటరమణ (60), కృష్ణ కుమారి (55) దంపతుల ఇంటికి రెంట్ కోసం పది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని చెప్పి, అడ్వాన్స్‌గా యజమానికి కొంత డబ్బు కూడా ఇచ్చి, సామాన్లు తెచ్చుకుంటామని వెళ్లారు. ఆ మరుసటి రోజు రాత్రి మళ్లీ వచ్చి, ఇంటి యజమానితో కలుపుగోలుగా మాట్లాడారు. ఆ రాత్రి వారి ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళారు. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో మళ్ళీ వచ్చారు. పథకం ప్రకారం.. ఇంట్లోకి ప్రవేశించగానే వెంకటరమణ, ఆయన భార్య కృష్ణ కుమారిని కళ్లల్లో కారం కొట్టి.. ఆపై దారుణంగా హత్య చేశారు.

అనంతరం వారి ఇంట్లో ఉన్న నగదు, బంగార నగలు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. వెళ్లే ముందు తమ ఆనవాళ్లు ఎవరికీ తెలియకుండా ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు. రోజూ లాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా.. వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తల్లిదండ్రులు ఫోన్‌ లీఫ్ట్‌ చేయక పోవటంతో కంగారు పడి.. ఇంట్లోనే అద్దెకు ఉంటున్న పై పోర్షన్‌లో ఉన్నవారికి ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లి చూడటంతో ఇంటికి తాళం వేసి ఉందని, ఇంటి చుట్టూ కారం చల్లి ఉందని చెప్పారు. దీంతో మృతుల కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి తాళం పగలగొట్టి చూడగా వెంకట రమణ, కృష్ణ కుమారి మృతదేహాలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

హత్య జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు.. ఫింగర్ ప్రింట్స్ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు పింగర్ ప్రింట్స్ సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను జాగ్రత్తగా గాలించారు. అలాగే పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.