Hyderabad: మణికొండలో అగ్నిప్రమాదం.. గృహప్రవేశ దీపం కిందపడి ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు! వీడియో

హైదరాబాద్ మహా నగరంలో గత రెండు రోజులుగా వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న జీడిమెట్లలో రూ.100 కోట్ల ఆస్తి నష్టం జరగగా.. ఈ రోజు మణికొండలో గృహ ప్రవేశం చేసిన ఫ్లాట్ లో కలశం కింద పడటంతో ప్రమాదం జరిగింది...

Hyderabad: మణికొండలో అగ్నిప్రమాదం.. గృహప్రవేశ దీపం కిందపడి ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు! వీడియో
Manikonda Fire Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2024 | 12:39 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 27: హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం మధ్యాహ్నం జీడిమెట్లలోని ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. దాదాపు రూ.100 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదం ధాటికి మంటలు ఆకాశానికి ఎగబాకాయి. వీటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఎట్టకేలకు అదే రోజు అర్ధరాత్రి సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇంకా కళ్లముందు మెదులుతుండగానే మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో మరో అగ్నిప్రమాదం జరిగింది.

అసలేం జరిగిందంటే..

మణికొండ, రామంతపూర్‌లోని ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మూడురోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. సంతోష్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కలశం వెలిగించి.. అంతా నిద్రపోయారు. అక్కడ వెలిగించిన దీపం బుధవారం తెల్లవారు జామున కిందపడింది. దీంతో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన సంతోష్‌ కుటుంబం ఇంట్లో గ్యాస్‌ స్టౌవ్‌ను ఆఫ్‌ చేసి, వెంటనే కిందకు పరుగులు తీశారు. అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలు ధాటికి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బుధవారం తెల్లవారు జామున 3.30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మంటల తాకిడికి పార్కింగ్‌లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.