Telangana: గోల్డ్ కొనేందుకు వచ్చింది..సేల్స్‌మ్యాన్‌ను మాటల్లో పెట్టింది.. కట్ చేస్తే.. పోకిరి లెవల్ ట్విస్ట్ అయ్యా. !!
బంగారం షాపులో గోల్డ్ కొనేందుకు వచ్చానని సేల్స్‌మ్యాన్‌తో మాట్లాడి అతనిని దృష్టి మలిచి వరుసగా ఆభరణాలు దోచుకెళుతున్న ఓ మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఆ మహిళ ఎవరు? దొంగతనం ఎలా చేసింది?
హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక లేడీని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారం షాపులో గోల్డ్ కొనేందుకు వచ్చానని సేల్స్‌మ్యాన్‌తో మాట్లాడి అతనిని దృష్టి మలిచి వరుసగా ఆభరణాలు దోచుకెళుతున్న మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారం మీద ఉన్న మక్కువతో తన దగ్గర డబ్బులు లేకున్నా సరే బంగారం షాపుకి వెళ్లి అక్కడ ఉన్న షాప్ వారిని దృష్టి మలిచి ఆభరణాలను చోరీ చేస్తుంది.
ఈనెల 23న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని దేవి జువెలరీ షాపుకు వెళ్లిన మహిళ ఇదే రీతిలో ఒక గోల్డ్ నెక్లెస్‌ను అపహరించింది. ఇంతకుముందు షాప్ లోకి ఎంటర్ అయ్యి గోల్డ్ నెక్లెస్‌లో చూపించాలని సేల్స్‌మ్యాన్‌ను కోరింది. సేల్స్‌మ్యాన్ ఆభరణాలు చూపిస్తున్న తరుణంలోనే అతని దృష్టి మరల్చి 73.916 గ్రాముల నెక్లెస్‌ను అక్కడి నుండి అపహరించింది. ఈ నెక్లెస్ రూ.2. 90 లక్షలు విలువ చేస్తుంది.
షాపులోని మొత్తం బంగారాన్ని చెక్ చేస్తున్న తరుణంలో షాపు యజమానికి ఈ నెక్లెస్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి మొత్తం సీసీ కెమెరాను చెక్ చేశాడు. నవంబర్ 23న మధ్యాహ్నం షాపుకు వచ్చిన మహిళ సేల్స్‌మ్యాన్ దృష్టి మలిచి గోల్డ్ నెక్లెస్‌ను ఎత్తుకెళ్లినట్టు సీసీ కెమెరాలో కనిపించింది. దీంతో షాప్ యజమాని వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం చెప్పాడు. కేపీహెచ్‌బీ పోలీసులు షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల గాలింపులో ఆ మహిళను పుట్ట సునీతగా గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలో బంగారు షాపులలో బంగారం కొనేందుకు వచ్చానని చెప్పి అక్కడ ఉన్న వారి దృష్టి మలిచి ఇదే తరహాలో ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటనలు గతంలోనూ సునీతపై ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాoడ్ నిమిత్తం జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి