వామ్మో..ఇంత దారుణమా..! మీరు వాడే యాంటి బయాటిక్స్ అసలైనవేనా..?
ఆర్‌ఎంపీలు మెడిసిన్స్ అమ్మేందుకు పర్మిషన్ లేదు. కానీ, నకిలీ మందులు అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుండడంతో కుప్పలు తెప్పలుగా వాటిని పేషెంట్లకు అంటగడుతున్నారు. ఓ రకంగా నకిలీ కంపెనీలకు, ఆర్ఎంపీలు సేల్స్‌మెన్‌గా తయారయ్యారు...
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది…అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, నూనెలు, పాలు.. ఇలా అనేక ఆహార పదార్థాల కల్తీకి సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తుండగా.. తాజాగా ప్రజల ప్రాణాలు కాపాడే మెడిసిన్‌ను కూడా కొంతమంది కేటుగాళ్ళు కల్తీ చేస్తున్నట్లు తేలింది..ఏదైనా జబ్బు వస్తే,అది తగ్గాలని మనం కొన్ని ట్యాబ్ లేట్ వేస్తాం..కానీ అవి కూడా పనిచేయవు ఎందుకంటే అవి పూర్తిగా నకిలీవి కాబట్టి.. తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం, కరకపట్లలో పెద్ద ఎత్తున్న నకిలీ యాంటిబట్టిక్స్ ను పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు..
ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ ఆంటీబయాటిక్ తయారు చేస్తున్నరు జోడస్ అనే సంస్థ 1.50 కోట్ల విలువైన నకిలీ యాంటీబయోటిక్ స్వాధీనం చేసుకున్నారు..జోడస్ ఎక్సో ప్రైవేట్ లిమిటెడ్ కమిటీలు, బయోటిక్ తయారీ నకిలీ ఆంటీబయాటిక్స్ ను ప్రముఖ కంపెనీలకు సరఫరా చేస్తున్న జోడస్ అనే సంస్థ… ఇలా రాష్ట్రంలో నకిలీ మెడిసిన్స్ దందా పెద్ద ఎత్తున జరుగుతోంది…యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో నకిలీ మందులు ఇంపోర్ట్ అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి నకిలీ మెడిసిన్స్ తెచ్చుడు కష్టంగా భావిస్తున్న కొంతమంది కేటుగాళ్లు, ఏకంగా ఇక్కడ్నే కంపెనీలు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తు న్నారు…ఆర్‌ఎంపీ డాక్టర్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ నకిలీ మందులను రోగులకు అంటగడు తున్నారు..
ఇక నకిలీ మెడిసిన్ ప్యాకేజీ కోసం బ్రాండెడ్ మెడిసిన్ లోగోలు, పేర్లను కేటుగాళ్లు వినియోగిస్తున్నారు. దాదాపు ఒరిజినల్ ప్రొడక్ట్ మాదిరిగానే ప్యాకేజ్ చేస్తున్నారని, మెడిసిన్‌ను ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని కూడా గుర్తించలేక పోతున్నారు..సన్ ఫార్మా, గ్లెన్ మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మాస్యూటికల్స్, టొరెంట్ ఫార్మా వంటి బ్రాండెడ్ కంపెనీల లోగోలు, వివరాలతో నకిలీ మెడిసిన్‌ను ప్యాక్ చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. బీపీ, షుగర్ పేషెంట్లు రెగ్యులర్‌గా వినియోగించే రొసువాస్, టెల్మా, మోనోసెఫ్, చిమోరల్ ఫోర్ట్, అమాగ్జిలిన్ వంటి మందులను సుద్ద, చాక్ పీస్ పౌడర్, మక్క పిండి, ఆలుగడ్డ పిండితో తయారు చేస్తున్నట్టు తేలింది.
క్యాన్సర్, గుండె జబ్బు ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మందులకు కూడా నకిలీలను తయారు చేస్తున్నట్లు సమాచారం..గత డిసెంబర్‌లో మచ్చ బొల్లారంలోని ఓ గోడౌన్‌లో తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పెద్ద మొత్తంలో నకిలీ క్యాన్సర్ మెడిసిన్స్ సీజ్ చేశారు.. క్యాన్సర్, గుండె జబ్బుల్లో ఉపయోగించే మందుల ధరలు ఎక్కువగా ఉంటాయి. పేషెంట్లు ఏండ్ల తరబడి వీటిని వాడాల్సి ఉంటుంది. దీంతో కేటుగాళ్లు వీటికి నకిలీలను తయారు చేసి, తక్కువ ధర ఆశ చూపి పేషెంట్లకు అంటగ డుతున్నారు. ఆర్‌ఎంపీలు, డ్రగ్ కంట్రోల్ అనుమతిలేని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పేషెంట్లకు వీటిని చేరవేస్తున్నారు. కేటుగాళ్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి కొంత మంది ఆర్‌ఎంపీలు, అదే పనిగా నకిలీ మందులను అంటగడుతున్నారు. ఇందుకోసం వాట్సప్ గ్రూపులను వేదికలుగా చేసుకుంటున్నారు..ఆర్‌ఎంపీలే సేల్స్‌మెన్ ఆపద సమయంలో ప్రజలకు ప్రాథమిక వైద్యసాయం అందించాల్సిన కొంత మంది ఆర్ఎంపీలు..నకిలీ మందులు అంటగట్టి పేషెంట్ల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట తయారు చేసిన నకిలీ మందులను తయారీదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని పేషెంట్లకు అమ్ముతున్నారు.
ఇటీవల డీసీఏ జరిపిన దాడుల్లో కొంత మంది ఆర్ఎంపీల వద్ద పెద్ద మొత్తంలో హైడోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ మందులను సీజ్ చేశారు. ఆర్‌ఎంపీలు మెడిసిన్స్ అమ్మేందుకు పర్మిషన్ లేదు. కానీ, నకిలీ మందులు అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుండడంతో కుప్పలు తెప్పలుగా వాటిని పేషెంట్లకు అంటగడుతున్నారు. ఓ రకంగా నకిలీ కంపెనీలకు, ఆర్ఎంపీలు సేల్స్‌మెన్‌గా తయారయ్యారు…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి