AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బరాత్‌లో జోరుగా పటాకులు కాల్చారు…. కట్ చేస్తే.. వరుడికి సీన్ సితారా అయింది..

వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఒకరు రాశారు. పటాకులు పేల్చడానికి సంబంధించి నియమాలు, నిబంధనలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని మరొకరు రాశారు. లేకుంటే అలాంటి వ్యక్తులు తమతో పాటు అమాయకులను చంపేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Viral Video: బరాత్‌లో జోరుగా పటాకులు కాల్చారు.... కట్ చేస్తే.. వరుడికి సీన్ సితారా అయింది..
Car Caught Fire
Jyothi Gadda
|

Updated on: Nov 27, 2024 | 6:18 PM

Share

సంతోషకరమైన సందర్భాలలో బాణసంచా కాల్చడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. కానీ పటాకులు కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నకూడా దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింద. పెళ్లి సమయంలో క్రాకర్స్ కాల్చుతుండగా, పొరపాటున నిప్పు రవ్వలు ఎగిరొచ్చి కారుపై పడ్డాయి. దాంతో ఖరీదైన కారు చూస్తుండగానే మంటల్లో కాలి బూడిదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌కు చెందినదిగా తెలిసింది. అక్కడ జరుగుతున్న పెళ్లి ఊరేగింపులో బంధువులు, స్నేహితులు కలిసి ఎంతో సంతోషంగా పటాకులు కాల్చారు. ఈ సమయంలో అక్కడ నుంచి అనేక వాహనాలు వస్తూ వెళ్తూ ఉన్నాయి. ప్రజల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే వరుడి కోసం అలంకరించిన కారు కూడా ఆ పక్కనే పార్క్ చేసి ఉండడం వీడియోలో కనిపిస్తోంది. బాణాసంచా కాల్చడంతో ఆ మంటలు కాస్త కారులో పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి

క్షణాల్లో కారు పూర్తిగా మంటల్లో మునిగిపోయింది. కారులో నుంచి దూకి డ్రైవర్‌ ప్రాణాలు కాపాడుకున్నాడు. ఖరీదైన కారు కాలి బూడిదైంది. కారులో మంటలు చెలరేగడంతో అక్కడున్న వారంతా షాక్‌లో ఉండిపోయారు. ఏం జరిగిందో తెలియక అందరూ నిస్సహాయంగా ఉండిపోయారు. జనం కళ్ల ముందే కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైనా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇదంతా వీడియోను రికార్డ్ చేసారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఒకరు రాశారు. పటాకులు పేల్చడానికి సంబంధించి నియమాలు, నిబంధనలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని మరొకరు రాశారు. లేకుంటే అలాంటి వ్యక్తులు తమతో పాటు అమాయకులను చంపేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్