Vastu Tips: ఈ మొక్క మీ ఇంటి ఆవరణలో.. ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉంటే డబ్బే డబ్బు ఆనందం కూడా…!

వాస్తు శాస్త్రంలో గన్నేరు పూలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పచ్చగన్నేరు పూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉండటం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. దాని వల్ల కలిగేలాభాలేమిటో.. వాస్తు ప్రకారం వాటిని ఏ దిక్కున నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Nov 27, 2024 | 3:23 PM

వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత అవసరమో, అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరం. వాస్తు శాస్త్రం సూచించిన కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. వాస్తు నియమాలు పాటిస్తే సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ ఇంటికి సరైన వాస్తు మీ అదృష్టాన్ని కూడా మార్చగలదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తువిషయంలో మన ఇళ్లు, ఇంటి చుట్టూ పెంచుకునే మొక్కలు కూడా ప్రభావం చూపుతాయని మీకు తెలుసా..? అటువంటిదే పచ్చగన్నేరు మొక్క..

1 / 5
గన్నేరు మొక్క విషపూరితమైనది అయినప్పటికీ.. వాస్తు ప్రకారం గన్నేరు చెట్టు దాని పువ్వులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. మీ ఇంటి ఆవరణలో పచ్చగన్నేరు మొక్కను నాటితే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని చెబుతున్నారు. దీంతో పాటు కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది.

2 / 5
వాస్తు ప్రకారం ఇంట్లో గన్నేరు మొక్కను నాటడం చాలా శుభప్రదం. ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుంది. అయితే, గన్నేరు మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల ఉంచకూడదు. వాస్తు ప్రకారం, ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో గన్నేరు మొక్కను నాటడం శ్రేయస్కరం. ఈ దిశలో దీనిని పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి.

3 / 5
పసుపు రంగు గన్నేరు చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. కాబట్టి ఏదైనా శుభకార్యానికి ముందు ఈ పూల చెట్టును ఇంటికి తీసుకురావచ్చు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశద్వారం వద్ద ఈ పసుపు రంగు చెట్టును ఉంచినట్లయితే సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.

4 / 5
గన్నేరు పూలని జ్యోతిష్య శాస్త్రంలో మంగళ దోష నివారణకు ఉపయోగిస్తారు. అందుకే ఈ పువ్వులు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. పూజ సమయంలో ఈ పువ్వును విష్ణువుకు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. గన్నేరు మొక్కకు ప్రతి రోజూ నీటిని పోస్తూ ఉంటే.. మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. అయితే, ఈ చెట్టు విత్తనాలు విషపూరితమైనవి. కాబట్టి వీటిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవడం మంచిది.

5 / 5
Follow us