కర్పూరం ఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి తయారు చేస్తారు. దీని వాసన చాలా బలంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు. పండుగ సందర్భాలలో, దేవుడి ఉత్సవాలు, నైవేద్యాలలో పచ్చ కర్పూరాన్ని వాడతారు. పచ్చ కర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా, మనసుకు హాయిని ఇస్తుంది.