Telangana: పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ బహిష్కరించిన ఆదర్శ గ్రామం..! ఎక్కడో తెలుసా..?

అదో చిన్న గ్రామం.. కానీ, ఇప్పుడు ఎంతోమందికి అది ఆదర్శంగా నిలుస్తుంది.. పరిశుభ్రతతో కూడిన పర్యావరణాన్ని సృష్టించేందుకు నడుం బిగించింది ఆ గ్రామం..ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ నియంత్రణ దిశగా చక్కటి విధానాన్ని అవలంబిస్తోంది..గ్రామంలో ప్లాస్టిక్ ఎవరు వాడరాదు అని తీర్మానం చేసుకొని...ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు..వివరాల్లోకి వెళ్తే ..

Telangana: పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ బహిష్కరించిన ఆదర్శ గ్రామం..! ఎక్కడో తెలుసా..?
Banned Plastic Items
Follow us
P Shivteja

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 27, 2024 | 6:49 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామానికి చెందిన ప్రజలు వారి గ్రామంలో మూకుమ్మడిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేశారు..గ్రామంలో మొత్తం 180 ఇండ్లు ఉండగా, 655 మంది జనాభా ఉన్నారు..ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయడం చాలా ఉత్తమమని గ్రామస్తులంతా కూడి, మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు..ప్లాస్టిక్ వాడడం వల్ల రోగాల బారిన పడతామని,ప్లాస్టిక్ అనేది ఎన్నో రోగాలు రావడానికి దారి తీస్తుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారు..

మరో వైపు ప్లాస్టిక్ వాడకుండా గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు.. గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న స్టీల్ ప్లేట్లే వాడుతున్నారు, ఇతర గ్రామాల నుండి సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడానికి సైతం కవర్లు వాడకుండా, బట్ట సంచులు వాడుతున్నారు….స్కూల్ కి వెళ్లే పిల్లలకు సైతం స్టీల్ గ్లాసులు, స్టీల్ బాక్స్ లలో భోజనం పెట్టి, పంపిస్తున్నారు.. ప్లాస్టిక్ వాడకాన్ని ఇలా పూర్తిస్థాయిలో నిషేధించి తమ ఆరోగ్యాలను, పిల్లల భవిష్యత్తును,గ్రామ పరిసరాలను కాపాడుకుంటున్నామని అంటున్నారు..

గూడెం గడ్డ గ్రామస్తులు తమ గ్రామంలాగా, ఇతర గ్రామాలు కూడా ప్లాస్టిక్ ని నిషేధించి ఆదర్శంగా మెలగాలంటూ కోరుతున్నారు. మరో వైపు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడంతో పాటు, గ్రామంలో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు వాడకంతో పాటు, చెత్తాచెదారం పేరుకు పోకుండా స్వచ్ఛత కూడా పాటిస్తున్నారు గ్రామ ప్రజలు.. చిన్న గ్రామం ఆయిన సరే వీరి వచ్చిన ఆలోచన మాత్రం చాలా పెద్దది అని అంటున్నారు అందరూ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి