AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: RID గోల్డెన్‌ జూబ్లీ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌.. హాజరైన మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు

అపూర్వ సమ్మేళనానికి కొల్లాపూర్‌ వేదిక అయింది. రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్‌ కాలేజీ... స్వర్ణోత్సవాలతో పులకించిపోయింది. కొల్లాపూర్‌ను కొహినూర్‌ వజ్రంలా మార్చడమే RID గోల్డెన్‌ జూబ్లీ వేదిక లక్ష్యమన్నారు పూర్వ విద్యార్ధులు. ఈ స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్ధులు అభినందించారు.

Telangana: RID గోల్డెన్‌ జూబ్లీ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌.. హాజరైన మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు
RID School and College Golden Jubilee Celebrations
Ram Naramaneni
|

Updated on: Nov 27, 2024 | 7:53 PM

Share

సృష్టిలో స్నేహమొక స్రవంతి.  మధురమైన అనుభూతులను పంచుతుంది….  కొల్లాపూర్‌లోని రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ సంబురాలను చూస్తే … ఆ అనుబంధమే కనిపించింది. పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ వేడుకలు..  వైభవంగా మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఒకరినొకరు పలకరించుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. అంతేకాదు, RID మీద రాసిన ప్రత్యేక పాటతో అలరించారు ఓ పూర్వ విద్యార్ధి.

RID గోల్డెన్‌ జూబ్లీ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ ప్రారంభోత్సవంలో.. మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు దంపతులతో పాటు, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత కటికనేని సాయి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిట్స్‌ వీసీ, మాజీ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. రామ్‌గోపాలరావు, హార్వార్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కే జయరాం రెడ్డి, రాజా ఆదిత్య లక్ష్మరావు, ప్రొఫెసర్‌ ఎం బాలరామ్‌  ఇతర పూర్వ విద్యార్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇంతటి మహామహుల తోడ్పాటుతోనే RID స్కూలుకు పూర్వవైభవం వచ్చిందన్నారు కటికనేని సాయి ప్రసాద్‌.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు అన్నారు. RIDలో చదువుకుని గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదిగారన్నారు. తాము ఈ స్థానంలో ఉన్నామంటే గురువుల పుణ్యమే అన్న కృష్ణారావు.. స్కూల్‌ ఆధునీకరణకు కృషి చేసిన రామేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.

మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. గత జ్ఞాపకాలను తలచుకుంటూ ముందుకు సాగుదామన్నారు. సంస్కారం, చదువు ఇచ్చిన రాణి ఇందిరా దేవి హై స్కూలును మరువలేమన్నారు. ఆ సంస్కారంతోనే ప్రతీ ఒక్కరూ భావితరాలకు మరింత తోడుగా నిలువాలని ఆకాంక్షించారు.

Rid School

పూర్వ విద్యార్ధులు.. 2వేల మందికిపైగా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చారు. పాత మిత్రులను కలుసుకుని ఉప్పొంగిపోయారు. తమ గురువులను సత్కరించారు. అంతేకాదు, 50 ఏళ్ల నుంచి చదువుకుంటున్న ఒక్కో బ్యాచ్‌ను వేదికపై పిలిచి  RID అవార్డులతో సన్మానించారు. సాయంత్రం  RID గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో సాంస్కృతిక ఉత్సవాలు అలరించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి