TGSET 2024 Verification Dates: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024లో అర్హత సాధించారా? సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు వచ్చేశాయ్‌..

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్ధులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలను వెల్లడించింది..

TGSET 2024 Verification Dates: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024లో అర్హత సాధించారా? సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు వచ్చేశాయ్‌..
TGSET 2024 Verification Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2024 | 7:11 AM

హైదరాబాద్, నవంబర్‌ 28: కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అవసరమైన టీజీసెట్‌ (తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష- 2024) పరీక్షలో అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాల పరిశీలన తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టుల్లో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు న‌వంబ‌ర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఈ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1884 మంది మాత్రమే అర్హత సాధించారు. లంగాణ సెట్‌ పరీక్షకు మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 7.17 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. అర్హత సాధించిన వారికి వివిధ సబ్జెక్టుల వారీగా ఓయూ క్యాంపస్‌ దూరవిద్య కేంద్రంలోని ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్ధులు తమతో పాటు తెచ్చుకోవల్సిన సర్టిఫికెట్లు ఏవంటే.. టీజీసెట్-2024 స్కోర్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, పీజీ మార్కుల జాబితా, పీజీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగ అభ్యర్థులైతే సంబంధిత సర్టిఫికెట్, ఈడబ్యూఎస్ కోటా వారైతే సంబంధిత సర్టిఫికెట్, రెండు సెట్ల జిరాక్స్ కాపీల చొప్పన తీసుకురావల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!