Agniveer Recruitment Rally: హైదరాబాద్‌లో అగ్నివీర్‌ సైనిక నియామక ర్యాలీ.. ఆ పరీక్ష రాసినవారే అర్హులు

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ లో జరగనున్న అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీకి సంబంధిచి ఆర్మీ అధికారులు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. అదేంటంటే..

Agniveer Recruitment Rally: హైదరాబాద్‌లో అగ్నివీర్‌ సైనిక నియామక ర్యాలీ.. ఆ పరీక్ష రాసినవారే అర్హులు
Agniveer Recruitment Rally
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2024 | 7:31 AM

హైదరాబాద్, నవంబర్‌ 28: భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువతను భారతీయ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబరు 8 నుంచి 16 వరకు ఈ ర్యాలీ నిర్వహనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అగ్నివీర్‌ టెక్నికల్, క్లర్క్‌, స్టోర్‌ కీపర్, ట్రేడ్స్‌మెన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎవరైనా ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

అయితే ఆన్‌లైన్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలు, ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారి మేజర్‌ ప్రకాష్‌ చంద్ర ఓ ప్రకటలో తెలిపారు. ఆయా తేదీల్లో ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు చేరుకోవాలని సూచించారు. భారత సైన్యంలోకి అగ్నివీర్‌లను చేర్చుకునేందుకు ఈ ర్యాలీలు జరగనున్నాయి. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్‌, స్టోర్‌కీపర్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NMMS Exam హాల్‌టికెట్లు విడుదల.. డిసెంబర్‌ 8న రాత పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 (NMMS) రాత పరీక్షకు సంబంధించి హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 8వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం తెలిపింది. డిసెంబర్‌ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెబ్‌సైట్‌ స్కూల్‌ లాగిన్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యేటా ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌ అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు. ఇందులో అర్హత సాధించిన వారికి స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

ఇవి కూడా చదవండి

NMMS 2024 రాత పరీక్ష హాల్‌టికెట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?