AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSC 2008 Victims: డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. మరో వారంలో వారందరికీ ఎస్జీటీ కొలువులు

డీఎస్సీ 2008 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ తీపికబురు చెప్పింది. బాధితులకు మరో వారం రోజుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయ కొలువుల నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపింది..

DSC 2008 Victims: డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. మరో వారంలో వారందరికీ ఎస్జీటీ కొలువులు
DSC 2008 Victims
Srilakshmi C
|

Updated on: Nov 28, 2024 | 8:00 AM

Share

హైదరాబాద్, నవంబర్‌ 28: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. మొత్తం 1399 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకోనున్నాఉ. గత నెలలోనే వీరందరికీ ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు పరిశీలించారు. రేవంత్‌ సర్కార్‌ ఆదేశాల మేరకు వీరందరికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వారికి నియామకపత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఇప్పటికే డీఎస్సీ 2024లో క్రీడాకోటా ఉపాధ్యాయ నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన ముగిసిందని వెల్లడించిన ఆయన.. త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తామని చెప్పారు. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్నారు.

నవోదయ దరఖాస్తుల సవరణకు ఎడిట్‌ విండో ఓపెన్‌.. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష

దేశ వ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా (JNV)ల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 26వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. వివిధ దఫాల్లో దరఖాస్తు గడువు పొడిగించిన సంస్థ ఎట్టకేలకు దరఖాస్తు ప్రక్రియను ముగించింది. దరఖాస్తులో మార్పులు చేసేందుకు నవంబర్‌ 28వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ మేరకు జేఎన్‌వీ అవకాశం కల్పించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే స్టూడెంట్‌ లాగిన్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి వ్యక్తిగత వివరాలు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది

కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 చొప్పున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 జేఎన్‌వీలు ఉన్నాయి. వీటిల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 8, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఆ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నవోదయ 9వ తరగతి దరఖాస్తులో సవరణల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నవోదయ 11వ తరగతి దరఖాస్తులో సవరణల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.