Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Fengal: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. నేడు రేపు ఏపీలో వానలే వానలు.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ కు ఫెంగల్‌ అనే నామకరణం చేశారు. ఫెంగల్‌ తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అటు.. తుఫాన్‌ హెచ్చరికలతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే తమిళనాడులో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరిస్తోంది.

Cyclone Fengal: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. నేడు రేపు ఏపీలో వానలే వానలు.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక..
Cyclone Fengal
Surya Kala
|

Updated on: Nov 29, 2024 | 7:17 AM

Share

నైరుతి బంగాళాఖాతంలో  ఏర్పడిన తీవ్రవాయుగుండం.. తుఫాన్‌గా మారనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిమీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండంరేపు బలహీన పడి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ చెన్నై వైపు వెళ్లనుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ, నాగపట్నానానికి 330 కి.మీ, పుదుచ్చేరికి 390 కి.మీ, చెన్నైకి 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత.. శ్రీలంక సరిహద్దుల్లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్,  మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేడు రేపు ఏపీలో వర్షాలు

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని దక్షిణకోస్తాలోనూ మూడు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలోని పలుప్రాంతాల్లో ఈ రోజు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి-మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు దక్షిణకోస్తా, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫెంగల్ తుఫాన్‌ తీవ్రత దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో కూడా వర్షాలు

తెలంగాణకు కూడా వాతావరణశాఖ కీలక అలెర్ట్ ఇచ్చింది. తుఫాన్ ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.

దెబ్బతిన్న పంటలు .. రైతు కంట కన్నీరు

ఈ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా.. కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు జిల్లాలతోపాటు.. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. తమిళనాడు కావేరి డెల్టా ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వరి పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తమిళనాడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. భారీ వర్షాలతో తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు