Baby Flushed in Toilet: అప్పుడే పుట్టిన శిశువును చంపి.. ఆసుపత్రి టాయిలెట్‌లో పడేసి ఫ్లష్‌! చేతులేలా వచ్చాయో..

ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డను కళ్లు కూడా తెరవకముందే దారుణంగా హతమార్చింది. ఆస్పత్రిలోనే టాయిలెట్ లోకి తీసుకెళ్లి కమోడ్ లో పడేసి ఫ్లష్ చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది..

Baby Flushed in Toilet: అప్పుడే పుట్టిన శిశువును చంపి.. ఆసుపత్రి టాయిలెట్‌లో పడేసి ఫ్లష్‌! చేతులేలా వచ్చాయో..
Baby Flushed In Toilet
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2024 | 11:11 AM

బెంగళూరు, నవంబర్‌ 29: ఈ భూమిపై స్వార్ధం అంటూ కనిపించని ఒకే ఒక్క మనిషి అమ్మ. కానీ నేటి కాలంలో ఆమె కూడా వికృతంగా మారుతుంది. తాజాగా ఓ తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టీపుట్టగానే ఆ బిడ్డ ప్రాణాలను అత్యంత దారుణంగా తీసింది. మూడో కంటికి తెలియకుండా బాత్రూం టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్‌ చేసి, చేతులు దులుపుకుని వెళ్లిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని రాంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని రాంనగర్ జిల్లాలో హరోహళ్లిలోని ఆసుపత్రిలో మురుగు నీటి పైపులు బ్లాక్‌ అయ్యాయి. క్లీనింగ్‌ సిబ్బంది, ప్లంబర్లు ఆస్పత్రికి చేరుకుని డ్రైనేజీ పరిశీలించారు. పైపుల్లో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బ్లాకేజీని తొలగించేందుకు ప్రయత్నించగా వారి కళ్లకు ఊహించని దృశ్యం కనిపించింది. మొదట్లో అది గుడ్డలు వంటి వ్యర్థ పదార్థమని వారు అనుమానించారు. కానీ అప్పుడే పుట్టిన లేలేత శిశువు మృతదేహం ఒకటి వారికి కనిపించింది. వెంటనే పసిబిడ్డను బయటకుతీసి, ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పసిబిడ్డ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బిడ్డ పుట్టి ఒకటి, రెండు రోజులు అయ్యి ఉండొచ్చని, బిడ్డకు జన్మనిచ్చిన వారు ఇది బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు నవజాత శిశువు మిస్సింగ్‌పై తమ ఆసుపత్రి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని యాజమన్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శిశువును బయట నుంచి తెచ్చి ఆసుపత్రిలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్‌ చేసి చేశారా? లేదా ఆస్పత్రిలోనే ఉన్న పేషెంట్లు ఇలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేసడుతున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.