AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: బిజీ రోడ్డులో బ్రా వేసుకుని యువకుడి రీల్స్‌.. జనాల రియాక్షన్ చూడండి! వీడియో

సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్లు కావడానికి యువత పడరానిపాట్లు పడుతున్నారు. కొందరు రిస్క్ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరేమో జనాల మధ్య వెర్రి వేషాలు వేస్తూ కంపరం పుట్టిస్తుంటారు. అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకోవడంతో స్థానికులు దిమ్మతిరిగే షాకిచ్చారు.. వీడియో చూడండి

Viral video: బిజీ రోడ్డులో బ్రా వేసుకుని యువకుడి రీల్స్‌.. జనాల రియాక్షన్ చూడండి! వీడియో
Viral Reel In Haryana Market
Srilakshmi C
|

Updated on: Nov 29, 2024 | 10:38 AM

Share

సోషల్ మీడియాలో ఫేమస్‌ అవ్వడానికి యువతకు ఎంతకు దిగజారారో తెలిపే కథనం ఇది. అదొక బిజీ మార్కెట్. వివిధ అవసరాల కోసం వచ్చిపోయే జనాలతో ఆ మార్కెట్‌ కిటకిటలాడుతోంది. అంత రద్దీ మార్కెట్‌లోకి ఓ యువకుడు బ్రా వేసుకుని అశ్లీలంగా డ్యాన్స్‌ చేస్తూ.. అసభ్యంగా రీల్స్‌ షూట్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో చిర్రెత్రిపోయిన జనాలు మూకుమ్మడిగా దాడి చేసి.. సదరు యువకుడిని చితకబాదారు. క్షమాపణ చెప్పడంతో అతగాడిని విడిచిపెట్టారు. దీంతో బతుకుజీవుడాని పరుగు లంకించుకున్నాడు. ఈ ఘటన హర్యాణాలోని పానిపట్‌లోని ఇన్సార్‌ మార్కెట్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌ పట్టణంలోని మార్కెట్‌ నత్యం జనాలతో బిజిబిజీగా ఉంటుంది. ఆ సమయంలో ఓ యువకుడు ప్యాంట్‌ ధరించి, బ్రా వేసుకుని ప్రత్యక్షమయ్యాడు. చేతిలో చొక్కా పట్టుకుని అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తుంటే.. అతడి స్నేహితులు సోషల్‌ మీడియా కోసం రీల్స్‌ చిత్రించడం మొదలుపెట్టాడు. అతడి తీరుతో మహిళలు ఇబ్బంది పడుతుండటం గమనించిన దుకాణదారులు మూకుమ్మడిగా అడ్డగించారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని మందలించారు. కానీ ఆ యువకుడు వారి మాటలు ఖాతరు చేయకుడా తాను ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని, గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేశానని చెప్పాడు. తన అభిమానులకు ఇలాంటి వీడియోలంటే మహాఇష్టమని వారితో వాదించాడు. దీంతో చిర్రెత్తిపోయిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతడు క్షమాపణ చెప్పడంతో.. మరోసారి అలాంటి పచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామని హెచ్చరించి, వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఆ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదుకాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి కొంతమంది అసభ్యకరమైన పనులు చేయడానికి కూడా వెనుకాడట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. నెట్టింట వైరల్ అవ్వడం కోసం అశ్లీల కంటెంట్ ట్రెండ్ పెరుగుతుంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి అసంబద్ధమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను సృష్టించే విస్తృత ధోరణి నేటి యువతలో పెరిగిపోతుంది. కొందరు దీనిని హానిచేయని వినోదంగా చూస్తుంటే.. మరికొందరు ఇది సామాజిక సరిహద్దులను దాటుతుందని పలువురు ఆగ్రహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.