గుడ్‌న్యూస్..! ఆర్మీ కీలక నిర్ణయం..కార్గిల్ సహా 48 యుద్ధక్షేత్రాల పర్యటనకు గ్రీన్ సిగ్నల్..
ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ .. ఉపేంద్ర ద్వివేది వివరాలు వెల్లడించారు. పుణె యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు.
భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి ఆర్మీ సంచలన నిర్ణయం ప్రకటించింది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్‌లలో పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ .. ఉపేంద్ర ద్వివేది వివరాలు వెల్లడించారు. పుణె యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు.
సరిహద్దు ప్రాంతాల్లో పర్యటకుల కోసం సాహస కార్యకలాపాలను ఆర్మీ ప్రోత్సహిస్తుందని… ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు. కార్గిల్ , గల్వాన్ వంటి యుద్ధక్షేత్రాలను చూసేందుకు పర్యటకులకు అనుమతిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ లో పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ద్వివేది పేర్కొన్నారు.
గత కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు 48ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని…జనరల్ ద్వివేది వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..