Viral video : అందమైన అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తుండగా.. అప్పుడే వచ్చిన ఏనుగు ఏం చేసిందో చూస్తే అవాక్కే..!

భరతనాట్యం చేస్తున్న ఇద్దరు అమ్మాయిల వెనుక ఓ ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్‌నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, వెనుక నిలబడి ఉన్న ఏనుగు ఎవరూ ఊహించని విధంగా ఏం చేసిందంటే..

Viral video : అందమైన అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తుండగా.. అప్పుడే వచ్చిన ఏనుగు ఏం చేసిందో చూస్తే అవాక్కే..!
Elephant Dancing
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2024 | 7:50 PM

రాళ్లను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉంటుందని అంటారు.. అయితే, ఇది ఎవరైనా చూశారో లేదో తెలియదు గానీ, మంచి మ్యూజిక్‌తో పాటు డ్యాన్స్‌ కూడా ఉంటే.. మూగజీవాలు కూడా పదం కలుపుతాయని మాత్రం ఓ వీడియో రుజువు చేస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు ఔరా అనాల్సిందే. ఎందుకంటే.. ఈ వీడియోలో ఇద్దరు అందమైన అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుండగా, అక్కడకు ఓ ఏనుగు వచ్చింది. అది ఏం చేసిందో మీరు ఖచ్చితంగా వీడియోలో చూడాల్సిందే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అలాంటిదే ఇక్కడ ఓ గజరాజు వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ ఏనుగు డ్యాన్స్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హాల్చ‌ల్ చేస్తోంది. ఇద్ద‌రు అమ్మాయిలు భ‌ర‌త నాట్యం చేస్తుంటే ఓ ఏనుగు కూడా త‌న‌దైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే, అమ్మాయిల క‌న్నా ఆ ఏనుగు డ్యాన్స్ చాలా ఫేమ‌స్ అయ్యింది. దీనిపై ఐఎఫ్‌ఎస్ అధికారులు ఏమన్నారో తప్పక తెలుసుకోవాల్సిందే.

భరతనాట్యం చేస్తున్న ఇద్దరు అమ్మాయిల వెనుక ఓ ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్‌నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, వెనుక నిలబడి ఉన్న ఏనుగు కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో @sankii_memer హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. క్యాప్షన్‌లో “ఇద్దరు అమ్మాయిలు భరతనాట్యం చేస్తుండగా.. వెనుక నిలబడి ఉన్న ఏనుగు వారిని చూసి నృత్యం చేయడం ప్రారంభించింది.” అని రాసుకొచ్చారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏనుగు డ్యాన్స్‌ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ 15 సెకన్ల క్లిప్‌ని లక్షలాది లైక్‌ చేశారు. వేలాది కామెంట్లు కురిపిస్తున్నారు. కాగా, దీనిపై ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి కస్వాన్‌ స్పందించారు. ఏనుగులు ఒత్తిడికి గురైనప్పుడే ఇలా చేస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏనుగు నృత్యంగా భావించి జనాలు మైమరిచిపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..