వార్నీ ఇదెక్కడి వింతరా సామీ..! 20ఏళ్లుగా ఈ వస్తువు అతడి ముక్కులోనే ఉండిపోయింది.. కట్‌చేస్తే..
ఓ 23 ఏళ్ల యువకుడు గత 20 ఏళ్లుగా తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. రోజు రోజుకి సమస్య మరింత తీవ్రంగా మారటంతో విసిగిపోయిన ఆ వ్యక్తి చివరకు డాక్టర్ వద్దకు వెళ్లాడు. సంబంధిత టెస్టులు చేసిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తన అనారోగ్యానికి కారణం తెలుసుకుని సదరు వ్యక్తి కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శీతాకాలంలో జలుబు, దగ్గు, ముక్కు కారటం వంటి సమస్యలు సర్వసాధారణం. అయితే, ఇక్కడో వ్యక్తి మాత్రం ఒకటి రెండు రోజులు కాదు.. వారాలు కాదు.. నెలలు కూడా కాదు.. గత 20ఏళ్లుగా ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. చివరకు విసుగెత్తిపోయిన బాధితుడు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు అతనికి షాకింగ్ విషాయాన్ని వెల్లడించారు. సదరు వ్యక్తి ముక్కులో డైస్(పాచీక) ఇరుక్కున్నట్టుగా గుర్తించారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది.
జియాన్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల జియోమా గత 20ఏళ్లుగా నిరంతర తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడంతో బాధపడుతుండేవాడు. దీంత ఆందోళన చెందిన ఆ వ్యక్తి వైద్యుడి వద్దకు వెళ్లగా, అతడు అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడుతున్నాడని, అతని ముక్కులో ఏదో వస్తువు ఇరుక్కుపోయిందని గుర్తించారు. నాసల్ ఎండోస్కోపీ ద్వారా వైద్యులు పరీక్షించి అతని ముక్కులో పాచిక ఇరుక్కున్నట్టుగా గుర్తించారు. బయటకు తీయగా అది రెండు సెంటీమీటర్ల పాచిక అని, అది ముక్కులోనే ఇంతకాలం ఉండడంతో తుప్పు పట్టినట్లు గుర్తించారు. శ్వాసనాళంలోకి పడిపోయే అవకాశం ఉన్నందున దాన్ని తొలగించడం చాలా ప్రమాదకరమని, అయితే ఎలాగోలా బయటకు తీశామని చెప్పారు.
బాధితుడు జియోమా మాట్లాడుతూ, అతను మూడు లేదా నాలుగు సంవత్సరాల వయస్సులో, ఈ పాచికలు అనుకోకుండా అతని ముక్కులోకి వెళ్లి ఉంటుందని, తనకు కూడా ఎలాంటి జ్ఞాపకం లేదని చెప్పాడు. శస్త్రచికిత్స ద్వారా పాచికను ఎట్టకేలకు విజయవంతంగా తొలగించారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..