Watch: ట్రాఫిక్ పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్
మన చుట్టూ ఉన్న సమాజంలో రోజు రోజుకూ పెరుగుతున్న గూండాయిజంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతూ.. సోషల్ మీడియాలో ఓ సంఘటన విపరీతంగా వైరల్ అవుతోంది. జరిగిన సంఘటనపై ప్రజలు మండిపడుతూ ఇలాంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని వీడియో జనాల్ని ఆగ్రహావేశాలకు గురి చేసేవిగా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఎందుకుంటే.. ఈ వీడియోలో ఒక వృద్ధ ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ దారుణంగా దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యూనిఫామ్‌లో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టాడు ఓ ఆటో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. సమాచారం ప్రకారం ఈ సంఘటన అస్సాంలోని దిబ్రూగఢ్, నలియాపూల్ బజార్ ప్రాంతంలో జరిగిందని తెలిసింది.
విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఆటో డ్రైవర్ చెంపదెబ్బ కొట్టిన ఘటన అస్సాంలోని డిబ్రూఘర్‌లో ఆదివారం జరిగింది. సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ పోలీసు అధికారిని ఒక ఆటో డ్రైవర్ పలుషిత పదజాలంతో దూషించడమే కాకుండా ఆయనపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
🚨Assam: In Dibrugarh, an Auto Driver slapped and physically assaulted an elderly Police personnel.
👇: Read more
In a disturbing incident on Sunday, an auto driver reportedly a#saulted an on-duty traffic police officer at Naliapool Bazar in Dibrugarh.
The officer, who was… pic.twitter.com/Vw7UAUGCCS
— truth. (@thetruthin) November 27, 2024
పట్టపగలు, నడిరోడ్డుపై తోటి వాహనదారులు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు చూస్తుండగానే సదరు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. జనమంతా చూస్తుండగానే ఆటో డ్రైవర్ పోలీస్‌ను కొడుతూ దుర్భాలటం వీడియోలో కనిపించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, ఇంటర్నెట్- స్థానికులతో పాటు- అస్సాం పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీని నిర్ధారించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..