AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISKCON Bangladesh: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంపై మతతత్వ ముద్ర..!

ఇస్కాన్‌ని స్థాపించింది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. మొదట ఓ భక్తిసంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ప్రభుపాద. వైష్ణవ సన్యాసిగా దేశ విదేశాలు తిరుగుతూ ఇస్కాన్‌కి పునాది వేశారాయన. కొన్నేళ్లు బృందావనంలో ఉండి అమెరికాకు వెళ్లిన ప్రభుపాద 1966లో అధికారికంగా ఇస్కాన్‌ని స్థాపించారు. అదే ఏడాది జూలై13న న్యూయార్క్‌లో మొదటి ఇస్కాన్‌ ఆలయ నిర్మాణం జరిగింది.

ISKCON Bangladesh: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంపై మతతత్వ ముద్ర..!
ISKCON Bangladesh
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2024 | 10:01 PM

Share

ఆగస్టు సంక్షోభం తర్వాత నాయకత్వ మార్పుతో బంగ్లాదేశ్‌ తీరు మారిందనుకున్నారు. మతమౌఢ్యం నుంచి బయటపడుతుందనుకున్నారు. కానీ ఆ దేశం మారలేదు. కవ్వింపు చర్యలు ఆగడంలేదు. సేవ, సహనాన్ని ప్రబోధించే ఇస్కాన్‌ గురువుని అకారణంగా అరెస్ట్‌చేసింది బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం. చిన్మయ్‌ కృష్ణదాస్‌ని జైలుకు పంపడమే కాకుండా.. ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపింది. దేశంలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై నిషేధానికి సిద్ధమవుతోంది. దీంతో భారత్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్మాత్మిక గురువుపై బంగ్లాదేశ్‌ దేశద్రోహి ముద్రవేయడంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్‌ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని ఆయనపై అభియోగం మోపారు. నవంబరు 25న చిన్మయ్‌ని ఢాకా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయ్‌కి బెయిల్‌ నిరాకరించటంతో.. మొదలైన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురయ్యారు. భారతీయుల త్యాగాలతో ఏర్పడిన బంగ్లాదేశ్‌కు ఇప్పుడా దేశంలో హిందువులు, హిందూ ఆలయాలు నచ్చడం లేదు. తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలోనే మైనారిటీలు లక్ష్యంగా భారీగా లూటీలు, దాడులు జరిగాయి. హిందూ ఆలయాలను...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి