బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఎవరి కుట్ర? ABT, జమాత్ లక్ష్యం హిందువులేనా.. చిన్మోయ్ కృష్ణ దాస్ నుంచి ఇస్కాన్ దూరం..

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసాకాండపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. అంతేకాదు హిందువులే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల విషయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ABT తీవ్రవాద సంస్థ, జమాత్-ఇ-ఇస్లామీలు కలిశాయని తెలుస్తోంది. అంతేకాదు ABT తీవ్రవాద సంస్థకు పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఎవరి కుట్ర? ABT, జమాత్ లక్ష్యం హిందువులేనా.. చిన్మోయ్ కృష్ణ దాస్ నుంచి ఇస్కాన్ దూరం..
Iskcon Bangladesh
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2024 | 8:40 AM

బంగ్లాదేశ్ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇస్కాన్ సంస్థ చిన్మోయ్ ప్రభు విషయంలో ఓ సంచలన ప్రకటన చేసింది. చిన్మోయ్ ప్రభు చేసే ప్రకటనలు లేదా కార్యకలాపాలకు ఇస్కాన్ సంస్థ బాధ్యత వహించదని ఇస్కాన్ బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ చారు చంద్ర దాస్ అన్నారు. ఢాకాలో విలేకరుల సమావేశంలో చంద్ర దాస్ మాట్లాడుతూ.. చిన్మయ్ ప్రభును ఇటీవల ఇస్కాన్ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు.

నిజానికి హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుతో బంగ్లాదేశ్‌లో కలకలం పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మోయ్ దాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆరోపించారు.

ఇస్కాన్ నే లక్ష్యంగా తీవ్రవాదుల సంస్థ

చిన్మయ్ దాస్ అరెస్టు, బెయిల్ తిరస్కరణతో అతని మద్దతుదారులు మంగళవారం కోర్టు వెలుపల హింసాత్మకంగా నిరసన తెలిపారు, ఇందులో ప్రభుత్వ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశ్‌లోని ఫండమెంటలిస్ట్ సంస్థ జమాత్-ఇ-ఇస్లామీ ఇస్కాన్‌పై చర్య తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. గురువారం బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్‌ను నిషేధించడానికి నిరాకరించినప్పటికీ.. ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్‌లోని తీవ్రవాదుల లక్ష్యంగా మారినట్లు తాజా పరిణామాలతో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

హిందువులను టార్గెట్ చేస్తోన్న ABT

మూలాల ప్రకారం ABT అంటే అన్సరల్లా బంగ్లా బృందం.. ఇది బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించి తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ABT తీవ్రవాద సంస్థ మరోసారి క్రియాశీలకంగా మారింది. నిజానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ABT చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రహ్మానీ 15 ఫిబ్రవరి 2013న బంగ్లాదేశ్ బ్లాగర్ హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలపై జైలులో ఉన్నాడు.

హిందువులకు వ్యతిరేకంగా జమాత్ క్రియాశీలమైంది!

ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రహ్మానీ ABT సంస్థను మళ్లీ బలోపేతం చేశాడు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రారంభించాడు. మూలాల ప్రకారం బంగ్లాదేశ్ హిందువులు, బంగ్లాదేశేతర హిందువులు ఇద్దరూ ABT తీవ్రవాద సంస్థ, జమాత్-ఇ-ఇస్లామీ లక్ష్యంగా ఉన్నారు.

షేక్ హసీనా ప్రభుత్వం ఏబీటీపై ఉక్కుపాదం మోపింది. అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత విద్యార్థి ఉద్యమం ముసుగులో హింస సమయంలో ABT , జమాతే ఇస్లామీ సంస్థలు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజానికి చెందిన ప్రజలను, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరసగా దాడులు నిర్వహిస్తున్నాయి.

ABT తీవ్రవాద సంస్థ తెలుసు

అన్సరాల్లా బంగ్లా టీమ్ అనేది ISIS తరహాలో ఇస్లామిక్ స్టేట్‌ను విశ్వసించే ఉగ్రవాద సంస్థ. ఈశాన్య ప్రాంతం ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు కూడా కుట్ర పన్నుతోంది. 2023 సంవత్సరంలో అస్సాంలో ABTకి చెందిన అనేక టెర్రర్ మాడ్యూల్స్ బహిర్గతమయ్యాయి. అనేక మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాద సంస్థకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పూర్తి మద్దతు ఉంది.