AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: దీపావళి దుంపను ఎప్పుడైనా చూశారా.? అబ్బో ఎంత పొడవుందో..!

అల్లూరి జిల్లా పాడేరు వారపు సంతలో భారీ నాగలి దుంప కనిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 అడుగులు నాగలి దుంప అందరిని ఆకర్షించింది. వారపు సంతలో కనిపించిన ఈ భారీ దుంపను చూసేందుకు జనం బారులు తీరారు. ఓ రైతు తాను పండించిన దుంపల్లో.. ఈ నాగలి దుంప ఒకటి.

Andhra: దీపావళి దుంపను ఎప్పుడైనా చూశారా.? అబ్బో ఎంత పొడవుందో..!
Andhra
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 18, 2025 | 12:22 PM

Share

అడవుల్లో చెట్లు చేమలకు పదం ఉండదు. రకరకాల చెట్లు, కాయలు, పళ్ళు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఆహారంగా మనుషులు తీసుకోగలరు. ఇక దుంప జాతుల్లోనూ అదే పరిస్థితి. అయితే కొన్ని దుంప జాతులను గిరిజనుల స్వయంగా పండిస్తూ ఉంటారు. వాటిని ఆహారంగా తీసుకోవడం కోసం కొంతమంది.. సంతల్లో అమ్మి వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకోవాలని మరికొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. చిలగడ దుంప, బంగాళదుంప, కంద, కర్ర పెండలం.. లాంటి దుంప జాతులను పండిస్తూ ఉంటారు గిరిజనులు. అటువంటి దుంప జాతుల్లో ఒకటి నాగలి దుంప.

అల్లూరి జిల్లా పాడేరు వారపు సంతలో భారీ నాగలి దుంప కనిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 అడుగులు నాగలి దుంప అందరిని ఆకర్షించింది. వారపు సంతలో కనిపించిన ఈ భారీ దుంపను చూసేందుకు జనం బారులు తీరారు. ఓ రైతు తాను పండించిన దుంపల్లో.. ఈ నాగలి దుంప ఒకటి. ఈ దుంపతో ఫోటోలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు. చివరకు 320 రూపాయలకు నాగలి దుంప ధర పలికింది. దీంతో ఆ రైతు ఎగిరి గంతేశాడు.

దీపావళి దుంపగా..

గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లు కూడా మైదాన ప్రాంతాల కంటే కాస్త భిన్నం. అయితే.. నాగలి దుంప ను దీపావళి సందర్భంగా తినడం గిరిజనుల్లో కొంతమంది ఆచారంగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా పండుగకు ముందు పాడేరు, హుకుంపేట, జి మాడుగుల మండలాల నుంచి గిరిజన రైతులు వీటిని పండించి సంతలకు తీసుకొస్తూ ఉంటారు. పంట వేశాక రెండేళ్ల తర్వాత ఈ దుంప కోసం తవ్వితే భారీ దుంప లభిస్తుందని చెబుతుంటారు రైతులు. భారీ పరిమాణంలో దొరకడం అరుదు. అంత భారీగా దుంప తవ్వకంలో బయటపడితే ఆ గిరిజన రైతు అదృష్టంగా భావిస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

నాగలి దుంపను వైల్డ్ బీట్స్ లేదా ట్రైబల్ వైల్డ్ ఫుడ్ అని కూడా అంటారు. అంటే గిరిజనుల ఆహారం అన్నమాట. కొన్నిసార్లు ఈ దుంపలు చాలా పెద్ద పరిమాణంలో పెరుగుతూ ఉంటాయి. గిరిజన సంస్కృతిలో ఈ దుంపలను వంటలలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పండుగల సమయంలో ఈ దుంపలతో చేసిన వంటకాలు కూడా ప్రత్యేకంగా ఆరగిస్తారు గిరిజనులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఈ నాగలి దుంప సాగు జరుగుతుంది.

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా