Viral Video: డబ్బుల హుండీ నిండిందని ఆశగా పగలగొట్టింది.. లోపల కనిపించింది చూడగా
ఓ మహిళ ఎన్నో నెలల నుంచి తనకు వచ్చిన డబ్బును కాసింత.. కాసింతగా ఒక హుండీలో దాచిపెట్టుకుంది. ఇక కొద్దిరోజులకు ఆ హుండీ బరువెక్కడంతో సంతోషంగా దాన్ని పగలగొట్టి.. అందులో ఉన్న డబ్బును లెక్కపెడుదాం అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ హుండీని బద్దలు కొట్టగా.. దెబ్బకు షాక్ అయ్యింది. ఎదురుగా కనిపించింది చూసేసరికి..!

ఇప్పుడంటే.! స్టాక్స్, ఫండ్స్.. ఈటీఎఫ్స్, ఎఫ్‌డీలని చాలా రకాలే ఉన్నాయి. వీటిల్లో ఏదొక దానిలో ఈ మధ్యకాలంలో జనాలు తమ డబ్బును దాచుకుంటున్నారు. అయితే పూర్వం ఇలా కాదు.. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీలో కూసింత డబ్బును కిడ్డీ బ్యాంక్ లేదా హుండీ(పింగాణీ గల్లాపెట్టె)లో లాంటి వాటిల్లో దాచుకునేవారు. ఒకసారి అవి ఫుల్‌గా నిండిన తర్వాత వాటిని పగలగొట్టి.. అత్యవసర సమయాల్లో ఆ డబ్బును ఉపయోగించుకునేవారు. ఇలా ఓ పింగాణీ హుండీలో తన డబ్బును దాచుకుంది ఓ మహిళ.. కొన్ని నెలలు లేదా సంవత్సరం తర్వాత ఆ డబ్బును తీసి లెక్కపెడదాం అని ఆశపడింది. కట్ చేస్తే..! దానిని పగలగొట్టేసరికి ఆమె ఆశలన్ని ఆవిరయ్యాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే.?
ఓ మహిళ తన కూడబెట్టుకున్న డబ్బును మొత్తం ఓ పింగాణీ హుండీలో పొదుపు చేసింది. ఒకట్రెండు రోజులు కాదు.. నెలలు లేదా సంవత్సరం పాటు ఆ డబ్బును అందులో దాచుకుంటూ వచ్చింది. ఇక ఒక్కసారిగా ఆ హుండీ నిండిన వెంటనే.. సంతోషంలో దానిలో ఎంత డబ్బు జమ అయింది. పగలగొట్టుకుని లెక్కపెడదాం అని అనుకుంది. అనుకున్నదే తడవుగా దాన్ని ఎంతో ఉత్సాహంగా పగలగొట్టింది. ఇక ఆ హుండీ లోపల కనిపించిన దృశ్యం చూసి దెబ్బకు దడుసుకుంది. హుండీలో దాచిపెట్టిన సొమ్ముతో ఏదైనా కొనుక్కుందాం అని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. హుండీలో ఉన్న డబ్బంతా చెద పురుగుల పాలైంది. చెద పురుగులతో హుండీలోని కరెన్సీ నోట్లన్ని కూడా సగం చిరిగి కనిపించాయి. ఆ దృశ్యంతో సదరు మహిళ గుండె బద్దలయినంత పనైంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి లుక్కేయండి.
ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే
View this post on Instagram




