Andhra: ఉదయాన్నే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు.. ఎంతకూ తిరిగిరాలేదు.. ఆరా తీయగా
ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు.. స్కూల్ ముగియగానే సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు అన్ని చోట్ల వెతికారు.. కానీ ఎక్కడా వాళ్ల జాడ కనిపించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఇక్కడ చూసేయండి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు,స్నేహితుల ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మక్బుల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బాలికలు తనకల్లు నుండి ఆర్టీసీ బస్సులో మొలకలచెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలికలను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

