Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అర్ధరాత్రి ట్రైన్ దిగిన ప్రయాణీకులు.. రోడ్డుపై కనిపించింది చూడగా గుండె గుభేల్

Andhra: అర్ధరాత్రి ట్రైన్ దిగిన ప్రయాణీకులు.. రోడ్డుపై కనిపించింది చూడగా గుండె గుభేల్

Ravi Kiran
|

Updated on: Oct 18, 2025 | 1:24 PM

Share

అర్ధరాత్రి ట్రైన్ దిగిన ప్రయాణీకులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లగా ఏదో తగిలింది. టార్చ్ వేసి చూడగా.. అమ్మబాబోయ్ దెబ్బకు హడలిపోయారు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ లుక్కేయండి మరి.

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొందరు ఇంకా మూఢనమ్మకాలపైనే విశ్వాసం చూపిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలిచే ఘటనలు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే జరిగాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. పట్టణ నడిబొడ్డున ఇండ్ల మధ్య క్షుద్ర పూజలు చేయడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పసుపు కుంకుమలతో పెద్ద ముగ్గు వేసి కోడిగుడ్లు, నిమ్మకాయలు పెట్టి భయానక స్థితిలో క్షుద్ర పూజలు చేశారు దుండగులు. అంత రాత్రి సమయంలో ఇళ్ల మధ్యలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తులను గుర్తించి తమను కాపాడాలంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించారు.

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా