బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో
బుల్లి తెరపై టాప్ టీఆర్‌పీతో దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కు బిగ్ ఝలక్ తగిలింది. ఈ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఈ షోపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ అనే వ్యక్తులు తెలుగు బిగ్ బాస్ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని, కనీసం కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుంటున్నట్లు ఆరోపించారు. సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు షో నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని, బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని హితవు పలికారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని యువత ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి
Telusu Kada: రాసుకున్నంత ఈజీ కాదు.. సినిమా తీయడం! హిట్టా..? ఫట్టా..?
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు
సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..
పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు..

