6,6,6,6,6,6,4,4,4.. ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా
ఫార్మాట్ ఏదైనా బ్యాటర్లు ఊచకోత కొస్తే.. బౌలర్ల ఆర్తనాదాలు గ్రౌండ్ అంతా వినిపిస్తాయి. ఈ మ్యాచ్‌లో కూడా అంతే.! ఓ బ్యాటర్ చేసిన విధ్వంసానికి.. ఏకంగా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మరి ఆ మ్యాచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఓడిపోతామని తెలిసినా.. వెన్ను చూపని పోరాటంతో వాళ్లు గెలిచిన మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియన్లు తరచుగా ICC టోర్నమెంట్లలో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. నిజానికి, ఆసీస్ జట్టు అత్యధిక ICC ట్రోఫీలను గెలుచుకుంది. 90వ దశకంలో రికీ పాంటింగ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు.. ఎదురులేనిదని చెప్పొచ్చు. ఇక ఆ జట్టుకు చెందిన ఓ బ్యాటర్ ఏకంగా 437 పరుగులు చేశాడు. మరి అతడెవరో తెలుసుకుందామా..
ఈ రికార్డు 103 సంవత్సరాల క్రితం నమోదైంది. 1927లో ఆస్ట్రేలియా దేశీయ ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విక్టోరియా 197 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇందుకు ప్రధాన కారణం బిల్ పోన్స్‌ఫోర్డ్. ఈ మ్యాచ్‌లో అతడు 400 కంటే ఎక్కువ పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు మైదానంలో 621 నిమిషాలు గడిపాడు.
ఓపెనింగ్ బ్యాటింగ్ కు వచ్చిన బిల్ పోన్స్‌ఫోర్డ్ మొత్తంగా 437 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు ఉన్నాయి. అతడి అద్భుత ప్రదర్శన కారణంగా విక్టోరియా మొదటి ఇన్నింగ్స్‌లో 793 పరుగులు చేసింది. ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన క్వీన్స్‌ల్యాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 403 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా, క్వీన్స్‌ల్యాండ్ 197 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది.
బిల్ పోన్స్‌ఫోర్డ్ అంతర్జాతీయ కెరీర్
బిల్ పోన్స్‌ఫోర్డ్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. అతడు ఆస్ట్రేలియా తరఫున 29 మ్యాచ్‌లు ఆడి 48 సగటుతో మొత్తం 2122 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడు 7 సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 266 పరుగులు. అతని ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను పరిశీలిస్తే, 129 మ్యాచ్‌లు ఆడి 65 సగటుతో 13,819 పరుగులు చేశాడు. 47 సెంచరీలతో అత్యధిక స్కోరు 1266 పరుగులు.
ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే








