AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : 25ఫోర్లు, 8 సిక్సర్లు.. పెర్త్‎లో బౌలర్లను ఉతికారేసిన మాజీ కెప్టెన్..ఇది మామూలు ఊచకోత కాదు మామ

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పైనే అభిమానులందరి దృష్టి ఉంది. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతను కేవలం ప్లేయర్‎గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అయితే, రోహిత్‌కు మంచి విషయం ఏమిటంటే.. అతను మొదటి మ్యాచ్‌ను తన అద్భుతమైన రికార్డు ఉన్న పెర్త్ మైదానంలో ఆడబోతున్నాడు.

Rohit Sharma : 25ఫోర్లు, 8 సిక్సర్లు.. పెర్త్‎లో బౌలర్లను ఉతికారేసిన మాజీ కెప్టెన్..ఇది మామూలు ఊచకోత కాదు మామ
విభిన్నంగా ఆలోచించాం: "అందుకే, మేం ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. అది కేవలం ఒక్కరు లేదా ఇద్దరు ఆటగాళ్ల వల్ల సాధ్యమయ్యేది కాదు. జట్టులో ప్రతి ఒక్కరూ ఆ ఆలోచనను నమ్మాలి, ఆ దిశగా కృషి చేయాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించారు, ఇది చాలా మంచి విషయం."
Rakesh
|

Updated on: Oct 17, 2025 | 8:08 AM

Share

Rohit Sharma : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పైనే అభిమానులందరి దృష్టి ఉంది. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతను కేవలం ప్లేయర్‎గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అయితే, రోహిత్‌కు మంచి విషయం ఏమిటంటే.. అతను మొదటి మ్యాచ్‌ను తన అద్భుతమైన రికార్డు ఉన్న పెర్త్ మైదానంలో ఆడబోతున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో వన్డే ఫార్మాట్‌లో రోహిత్ రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో సాధారణంగానే రోహిత్ భారీ పరుగులు చేసినప్పటికీ, పెర్త్‌లో మాత్రం అతని బ్యాట్ నుంచి మెరుపులు వచ్చాయి.

పెర్త్ మైదానంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత ఆటగాడు ఎవరంటే అది రోహిత్ శర్మ మాత్రమే. ఈ హిట్‌మ్యాన్ ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఏకంగా 245 పరుగులు చేశాడు. పెర్త్‌లో రోహిత్ సగటు 122.5 గా ఉంది. ఇది ఈ మైదానంలో ఆడిన ఏ క్రికెటర్‌కైనా అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. పెర్త్‌లో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరకు 25 ఫోర్లు, 8 సిక్సర్లు వచ్చాయి, ఇది ఈ మైదానంలో అతని విధ్వంసక ఆటతీరును స్పష్టం చేస్తుంది.

పెర్త్‌లో రోహిత్ శర్మ చేసిన అత్యధిక స్కోరు 171 నాటౌట్. ఇది 2016లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 7 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. అతని ఈ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా టీమ్ ఇండియా 309 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, జార్జ్ బెయిలీల సెంచరీల సహాయంతో ఈ భారీ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇప్పుడు కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రోహిత్, మరోసారి పెర్త్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి, ఈసారి మాత్రం భారత్‌ను గెలిపించాలని కోరుకుంటున్నాడు.

పెర్త్ పిచ్‌పై బంతి చాలా వేగంగా దూసుకువస్తుంది. ఇక్కడ బౌలర్లకు ఎక్కువ బౌన్స్ లభిస్తుంది. సాధారణంగా బ్యాట్స్‌మెన్‌లకు ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అయితే, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్‌లకు బౌన్స్ ఉన్న వేగవంతమైన పిచ్ స్వర్గం లాంటిది. ఎందుకంటే, అతను షార్ట్ బాల్స్‌ను చాలా సులభంగా ఎదుర్కొంటాడు. అతని కట్, పుల్ షాట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. బంతి వేగంగా వచ్చినప్పుడు, అతను మరింత సులభంగా షాట్లు ఆడతాడు. అందుకే, ఈసారి కూడా పెర్త్‌లో రోహిత్ తన సత్తా చాటడానికి పూర్తి అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..