AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒంటరి మహిళను అలా చేస్తాడనుకోలేదు.. పాపం ఆ పిల్లలు..

ఓ మహిళ.. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ కవలలే.. మగ పిల్లలే.. కానీ వారిద్దరిలో ఒకరు అనారోగ్యం.. మరొకరు మానసిక వైకల్యంతో ఉన్నారు. తండ్రి.. దూరమయ్యాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు.. ఒంటరి మహిళగా ఇద్దరు కొడుకులను చూసుకోలేకపోయింది.. దీంతో శ్రావణ సంధ్యారాణి ఒక కొడుకును హాస్టల్‌లో చేర్పించింది.

Andhra: ఒంటరి మహిళను అలా చేస్తాడనుకోలేదు.. పాపం ఆ పిల్లలు..
Crime News
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 18, 2025 | 12:11 PM

Share

ఓ మహిళ.. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ కవలలే.. మగ పిల్లలే.. కానీ వారిద్దరిలో ఒకరు అనారోగ్యం.. మరొకరు మానసిక వైకల్యంతో ఉన్నారు. తండ్రి.. దూరమయ్యాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు.. ఒంటరి మహిళగా ఇద్దరు కొడుకులను చూసుకోలేకపోయింది.. దీంతో శ్రావణ సంధ్యారాణి ఒక కొడుకును హాస్టల్‌లో చేర్పించింది. మరొక కొడుకు ఆమెతోనే ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలకు అన్ని తానే చూసుకుంటున్న ఆ తల్లి.. ఇప్పుడు అనుకోని ఘటనలో దూరమైంది. ఇంటి ముందున్నవాడే కాలయముడై.. ఆమెపై కక్షగట్టి గొంతు కోసేశాడు. నడిరోడ్డుపైనే హత్య చేసేసాడు. దీంతో తండ్రి లేక.. ఇటు తల్లి ప్రాణం కూడా వీడడంతో ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

విశాఖపట్నం అక్కయ్యపాలెం నందగిరి నగర్‌లో ఇటీవల జరిగిన ఘటన.. ఇప్పుడు ఇద్దరు పిల్లలను అనాధగా మార్చేసింది. శ్రావణ సంధ్యారాణి అలియాస్‌ సోనూ అద్దె ఇంట్లో ఉంటుంది. సోనూకు ఎనిమిదేళ్ల వయస్సు గల ఇద్దరు కవలలు కొడుకులు ఉన్నారు. మానసిక వైకల్యంతో ఒకరు, అనారోగ్యంతో ఒకరు ఉన్నారు. శ్రావణ సంధ్యారాణి భర్త మణికంఠ.. భార్య, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. శ్రావణ సంధ్యారాణి తండ్రి పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మృతిచెందగా.. తల్లి కూడా కొన్నాళ్ల క్రితం మృతిచెందారు.

ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు.. ఒంటరి మహిళగా ఇద్దరు కొడుకులను చూసుకోలేక… శ్రావణ సంధ్యారాణి ఒక కొడుకును హాస్టల్‌లో చేర్పించింది. ఆ బాబుకు ఊపిరితిత్తుల సమస్య. మానసిక వైకల్యంతో ఉన్న మరొక కొడుకు ఆమెతోనే ఉండేవాడు. అయితే.. గత ఎనిమిది నెలల క్రితం నుంచి.. శ్రావణ సంధ్యారాణికి.. ఆమె ఎదురింట్లో కార్పెంటర్‌ కండిపల్లి శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. సంధ్యారాణి స్కూటీ సీటు కత్తిరించడంతో.. అది శ్రీనివాస రావే అనుకుని ఇద్దరు మధ్య గొడవ గతంలో జరిగింది. పోలీస్ స్టేషన్లోనూ సంధ్యారాణి ఫిర్యాదు చేసింది.

అయితే.. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితంగానే ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఏమైందో ఏమో కానీ బుధవారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో శ్రావణ సంధ్యారాణి వాకింగ్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది అడుగుల దూరం వెళ్లేసరికి వెనుక నుంచి వచ్చిన శ్రీనివాసరావు కత్తితో శ్రావణ సంధ్యారాణి పై దాడి చేశాడు కత్తితో ఆమె మెడ కోసేసాడు. దీంతో ఆమె తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

స్థానికులు అక్కడకు వచ్చేసరికి శ్రీనివాసరావు పరారైపోయాడు. 108 కు స్థానికులు సమాచారం ఇవ్వగానే వచ్చిన సిబ్బంది.. పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు రంగంలోకి దిగి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాసరావును గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. వేరొక మహిళతో శ్రీనివాసరావు సన్నిహితంగా ఉంటున్నాడని ప్రశ్నించడంతోనే సంధ్యారాణిని హత్య చేసినట్టు విచారణలో తేలిందని ఏసిపి లక్ష్మణరావు తెలిపారు. సంధ్యారాణికి ఒక సోదరుడు ఉన్నప్పటికీ అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తమ అనేవారు ఎవరూ లేకపోవడంతో ఇక.. ఇద్దరు కవలల పరిస్థితి ఏమిటనేది స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

అయితే.. ఆ ఇద్దరూ పిల్లలను తండ్రి వద్దకు చేర్చే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నట్టారు. తండ్రి గతంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.. కాబట్టి ఆ ఇద్దరు పిల్లలకు మళ్ళీ తండ్రి అక్కున చేర్చుకునే పరిస్థితి లేదన్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో అనాధగా మారిన ఆ పిల్లలు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరు ఇప్పటికే హాస్టల్లో ఆశ్రయం పొందుతున్నడంతో.. తల్లి చెంతన ఉండే మరో కొడుకు ను ఇప్పుడు పోలీసులు తాత్కాలిక వసతి కల్పించారు. దాతల సహకారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా