AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: పుతిన్ దాచిన లక్షల కోట్ల నిధి కోసం వేట.. సినిమా థ్రిల్లర్‌ను తలపిస్తున్న అన్వేషణ

Kleptocracy hunt: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రష్యా.. ఉక్రెయిన్‌పై

Vladimir Putin: పుతిన్ దాచిన లక్షల కోట్ల నిధి కోసం వేట.. సినిమా థ్రిల్లర్‌ను తలపిస్తున్న అన్వేషణ
Vladimir Putin
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2022 | 11:26 AM

Share

Kleptocracy hunt: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై దాడులను నిలవరించేందుకు అగ్రరాజ్యం అమెరికా మొదటినుంచి ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రతక్షంగా ఉక్రెయిన్‌ వైపు పోరడకపోయిన.. పరోక్షంగా రష్యా మీద ఆంక్షలు విధిస్తోంది. రష్యాకు చెందిన బిలియనీర్లు, రాజకీయ ప్రముఖులు, అమెరికాకు అధ్యక్షుడు జో బైడెన్ రాకుండా నిషేధించారు. అయితే.. ఈ క్రమంలో వ్లాదమిర్ పుతిన్‌కు సంబంధించిన సంపదపై పలు కథనాలు వెలువడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రష్యాలోని ప్రతి రూబుల్‌లో 50% తీసుకుని పుతిన్ దాచిపెడుతున్నట్లు పలు ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. రక్షణ సంస్థ KGBకి చెందిన ప్రముఖులు, సహచరులు, కూతుళ్లు, చిన్ననాటి స్నేహితుల సహాయంతో పుతిన్ సంపదను దాచిపెట్టినట్లు పేర్కొంటున్నాయి. ఇలా పుతిన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారని.. ఆయనకు సంబంధించిన 200 బిలియన్ డాలర్ల సంపద కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోందని యూకే సంస్థ పేర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా పుతిన్ దాచిన ట్రెజరీని కనుగునేందుకు చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సర్రేలో పుతిన్ కుమార్తెల వద్ద భారీ సంపదను కనుగొన్నట్లు సమాచారం. వీటితోపాటు విలాసవంతమైన భవనాలు, 700లకు పైగా కార్లు, 58 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలలో ఒకరు ప్రత్యేకమైన సర్రే ఎస్టేట్‌లో బిలియనీర్ రష్యన్ అద్దెదారులలో ఒకరిగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి MailOnline ఓ కథనాన్ని ప్రచురించింది. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ UKలో క్రెమ్లిన్ (పుతిన్) సంపద కోసం వేట ప్రారంభించినట్లు పేర్కొంది. దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి పుతిన్ అని.. రష్యాలోని ప్రతి రూబుల్‌లో 50 శాతం వరకు పుతిన్ 200 బిలియన్ పౌండ్ల సంపదను దాచిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు తన జీతంతో పాటు KGB పెన్షన్ నుంచి సంవత్సరానికి £70,000 మాత్రమే సంపాదిస్తారని పేర్కొంది. అయితే.. ఆయన అదేకాకుండా 200 బిలియన్ల డాలర్ల సంపదను సంపాదించాడని పశ్చిమ దేశాలు పేర్కొంటున్నాయని పేర్కొంది.

ఈ సంపద మొత్తం.. పుతిన్ తన స్నేహితులు, ప్రేమికులు, మాజీ KGB సహోద్యోగులు సహా.. ‘పర్స్ మెన్’ అని పిలువబడే చిన్ననాటి స్నేహితుల దగ్గర దీనిని దాచినట్లు పేర్కొంటున్నారు. దీనికనుగుణంగానే బ్రిటన్ సైతం రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేసింది. FBI కొత్త ‘క్లెప్టోక్రసీ యూనిట్’ ఉన్న UKలో పుతిన్ మిలియన్ల కొద్దీ ఆస్తులు ఉన్నాయని.. వాటి కోసం వేట కొనసాతున్నట్లు మెయిల్ ఆన్‌లైన్ పేర్కొంది. రష్యా అధ్యక్షుడి కుమార్తెలలో ఒకరికి ఈ ప్రాంతంలో భవనం ఉందని చాలా సంవత్సరాలుగా పుకార్లు ఉన్నాయని సర్రేలోని స్థానికులు చెప్పారు.

దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు రష్యాలో ఉన్నారని.. అక్కడ ప్రతి రూబుల్‌లో 50 శాతం వరకు దాచుకొని.. పుతిన్ 200 బిలియన్ పౌండ్ల వరకు సంపదను దాచిన అత్యంత ధనవంతుడు అని ఆరోపించారు. ఇంకా అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్యాలెస్‌లు, వ్యాపారాలు, కంపెనీలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. రష్యాలోని అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీల ద్వారా అతను స్థాపించిన మిత్రదేశాల నుంచి నిధులు సమకూర్చకుంటున్నట్లు నవల్నీ అప్పట్లో ఆరోపించారు.

అందుకే రష్యా అసమ్మతి వాది అయిన అలెక్సీ నవల్నీ ని జైలు పాలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. నవల్నీ.. పుతిన్ ను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడనే కారణంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకుపంపారు. 13 సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటూ నవల్నీ ప్రస్తుతం రష్యన్ జైలులో ఉన్నాడు. నవల్నీ ఇవన్నీ తెలియడంతోనే ఇలా జరిగిందని పేర్కొంటున్నారు.

కాగా.. 2003లో పుతిన్‌తో విభేదించిన రష్యా అత్యంత ధనవంతుడు మిఖాయిల్ ఖోడోర్కోవ్‌స్కీని అరెస్టు చేయాలని ఆదేశించినప్పుడు ఇదంతా బహిర్గతమైందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పుతిన్ కుమార్తెలకు ఆస్థులు ఎలా వచ్చాయి.. ఇంకా ఎక్కడెక్కడ ఆస్థులు ఉన్నాయనే దానిపై బ్రిటన్ సహా రష్యా వ్యతిరేక దేశాలు వేట కొనసాగించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Russia Ukraine War: యుద్ధ ప్రభావంతో పెరగనున్న వాటి ధరలు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..