Japan Earthquake Updates: జపాన్‌ను వణికించిన భూకంపం.. నలుగురు మృతి, 100 మందికి గాయాలు.. షాకింగ్ వీడియోలు
Japan Earthquake Videos: జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. బుధవారం రాత్రి సంభవించిన ఈ భూకంప ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. 107 మంది గాయపడినట్లు జపాన్ అధికార వర్గాలు తెలిపాయి.
Japan Earthquake News Updates: జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. బుధవారం రాత్రి సంభవించిన ఈ భూకంప ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. 107 మంది గాయపడినట్లు జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర జపాన్ లోని ఫుకుషిమాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. భూకంపం కారణంగా ఫుకుషిమా తీర ప్రాంతం వణికింది. భూకంప తీవ్రతకు బుల్లెట్ ట్రైన్ పట్టాలు తప్పాయి. కొన్నిచోట్ల రోడ్లు బీటలువాలాయి. షాపింగ్ మాల్స్‌లో వస్తువులు కిందపడ్డాయి. తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ముందుకు వచ్చినట్లు గుర్తించారు. భూకంప కేంద్రం 60 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు తేల్చారు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అధికారులు.
గురువారం వేకువజమాను సునామీ హెచ్చరికలను జపాన్ అధికారులు ఉపసంహరించుకున్నారు. గురువారం వేకువజామున కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటిగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
భూకంప తీవ్రతను చాటే వీడియో…
⭕ ⚠️? A Powerful 7.3 magnitude #earthquake hits north #Japan, #tsunami alert issued#Fukushima
Wed Mar 16 2022
? ? ? ? ? ? ℭ????????? | ???? ???? pic.twitter.com/j8P6HS0roC
— ♆ABYSS ℭ ? ? ? ? ? ? ? ? ? (@AbyssChronicles) March 16, 2022
మరోవైపు జపాన్ రాజధాని టోక్యో లో భూప్రకంపనలు కొన్ని నిమిషాల పాటు సంభవించిందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో రాజధానిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు అధికారులు. కొన్ని చోట్ల గురువారం వేకువజాము నుంచి విద్యుత్ పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల బహుళ అంతస్థుల గోడలకు బీటలు ఏర్పడినట్లు జపాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. జపాన్‌లో అణు విద్యుత్ కేంద్రాల వద్ద ఎలాంటి అసహజ పరిస్థితులు నెలకొనలేదని అధికారులు తెలిపారు.
భూకంప ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జపాన్ ప్రధాని కిషిదా . మరోవైపు జపాన్ ప్రభుత్వం ప్రధాని ఆఫీస్ వద్ద టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. భూకంపం కారణంగా జపాన్ లో భారీ నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. నష్టంపై అధికారులు అంచనావేస్తున్నారు.
సునామీ జపాన్‌లో బీభత్సం సృష్టించి 11 ఏళ్లు పూర్తయిన కొన్ని రోజుల వ్యవధిలోనే శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని తాగడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మళ్లీ భూకంపాలు వస్తాయేమోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
The Abroad in Japan studio took quite the beating from yesterday’s earthquake unfortunately. pic.twitter.com/19YgsXyVqV
— Chris Broad (@AbroadInJapan) March 17, 2022
WATCH: Woman captures the moment 2 strong earthquakes hit off central #Japan pic.twitter.com/qr2mPBvDrp
— GBN (@GBNfeed) March 16, 2022
Also Read..
Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!
Konaseema: కొబ్బరి తోటలో ప్రత్యేక్షమైన అరుదైన పక్షి.. ప్రాణం పోసిన రైతు.. అసలేమైందంటే..?