Russia-Ukraine War: రష్యాపై అగ్రరాజ్యం ఆగ్రహం.. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం..

అంతర్జాతీయ న్యాయస్థానం(UN Security Council) ఆదేశించినా వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూనే ఉంది. అంతకుమించి అన్నట్టు విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న ప్రాంతాలపైనా..

Russia-Ukraine War: రష్యాపై అగ్రరాజ్యం ఆగ్రహం.. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం..
Ukraine Russia War Un Secur
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 17, 2022 | 2:03 PM

అంతర్జాతీయ న్యాయస్థానం(UN Security Council) ఆదేశించినా వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూనే ఉంది. అంతకుమించి అన్నట్టు విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న ప్రాంతాలపైనా విచ్చలవిడిగా బాంబింగ్‌ చేస్తోంది. 22రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఐనా రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోయింది. పైగా రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి ప్రపంచ దేశాలు. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యా..దాడులను మరింత ముమ్మరం చేసింది. మరియుపోల్‌లో థియేటర్‌పై బాంబుల వర్షం కురిపించాయి రష్యన్‌ బలగాలు. అక్కడ వెయ్యిమందికి పైగా పౌరులు తలదాచుకున్నారు. ఈ దాడిలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇక రష్యా ఆధీనంలో ఉన్న మరియుపోల్‌ ఆస్పత్రిలో..వైద్యులు, రోగులను నిర్బంధించింది పుతిన్‌ సైన్యం. ఇక చెర్నిహివ్‌లో బాంబు దాడులకు ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

మరియుపోల్‌ థియేటర్‌పై బాంబు దాడిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది రష్యా. థియేటర్ వద్ద చిన్నారులు అంటూ రష్యన్ భాషలో రాసి ఉన్నా.. దాడి జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పుతిన్‌ను ఉద్దేశించి యుద్ధ నేరస్తుడు అని వ్యాఖ్యానించారు బైడెన్‌. అయితే బైడెన్‌ కామెంట్‌పై తీవ్రంగా మండిపడింది రష్యా. ఈ ప్రకటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని..క్షమించరానిదంటూ వ్యాఖ్యానించారు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌. ఐతే ఉక్రెయిన్‌లో రష్యా హింసాకాండను చూసి చలించిపోయారని అందుకే యుద్ధ నేరస్తునిగా పరిగణిస్తున్నట్టు తెలిపారు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ.

మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోన్న అమెరికా..మరో 800మిలియన్‌ డాలర్ల సైనిక సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మ‌రింత సాయం చేస్తామ‌ని..మ‌రిన్ని ఎయిర్‌క్రాఫ్టులు, ఆయుధాలు, డ్రోన్లు అందిస్తామ‌ని తెలిపారు అధ్యక్షుడు జో బైడెన్‌.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్..

Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..