Indo-China Relations: భారత్‌తో దోస్తీకి చైనా తహతహ.. డ్రాగన్ కంట్రీని నమ్మొచ్చా?
China-India border row: భారత్ - చైనా మధ్య గత రెండేళ్లుగా ప్రతిష్టంభన నెలకొంది. గాల్వాన్ లోయలో భారత్-డ్రాగన్ సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు
China-India border row: భారత్ – చైనా మధ్య గత రెండేళ్లుగా ప్రతిష్టంభన నెలకొంది. గాల్వాన్ లోయలో భారత్-డ్రాగన్ సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా – భారత్ మధ్య సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య 15 సార్లు చర్చలు జరగగా.. క్రమంగా వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికులను ఉపసంహరించుకున్నాయి. అయితే.. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న సైనిక ప్రతిష్టంభనలో భాగంగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చను పునరుద్ధరించడానికి న్యూఢిల్లీ వేదిక కానుంది. అయితే.. బీజింగ్‌లో త్వరలో జరగనున్న బ్రిక్స్ (BRICS 2022) శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనా స్టేట్ కౌన్సిలర్ విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెలలో భారత్‌లో పర్యటించారు. దీని తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం బీజింగ్‌లో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పాలనలోని అగ్ర పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య అధికారులు కూడా పాల్గొననున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత చైనాలో జరిగే బ్రిక్స్ (బ్రెజిల్-రష్యా-భారత్-చైనా-దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సమావేశంలో సరిహద్దు విషయం కొలిక్కి వస్తుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొనే ఈ బ్రిక్స్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే.. గల్వాన్ లోయ ఘటన తర్వాత తొలిసారిగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌లో పర్యటించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. చైనా విదేశాంగ మంత్రి పర్యటన ఖరారైతే 2020 తర్వాత ఇరు దేశాల మధ్య అత్యున్నతస్థాయి సమావేశం ఇదే కానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. ఈ అత్యున్నతస్థాయి సమావేశం తరువాత అగ్రనేతలు పాల్గొనే బ్రిక్స్ సమ్మిట్‌లో ఈ విషయం కొలిక్కి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రత్యేకంగా సంభాషించనున్నారని.. ఈ క్రమంలో సరిహద్దు సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు.
కాగా.. 2019 నవంబర్ లో బ్రిక్స్ సదస్సు బ్రెజిల్‌లో జరిగింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. అంతకుముందు అక్టోబర్ లో మహాబలిపురంలో అనధికారిక శిఖరాగ్ర సమావేశం కోసం జిన్‌పింగ్ భారతదేశాన్ని సందర్శించారు.
Also Read: