AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACB raids: ఏసీబీ సోదాల్లో ప్రభుత్వాధికారుల అక్రమాస్తులు బట్టబయలు.. దొరికిన ఆస్తులు చూసి అందరూ షాక్..

Karnataka ACB raids: అక్రమాస్తుల కేసులో కర్ణాటక ఏసీబీ నిన్న భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. వీటిలో వారి దిమ్మతిరిగే స్థాయిలో కోట్ల విలువైన ఆస్తులు(Unaccounted Assets) బయటపడ్డాయి. వాటిని అధికారులు సీజ్(Seize) చేశారు.

ACB raids: ఏసీబీ సోదాల్లో ప్రభుత్వాధికారుల అక్రమాస్తులు బట్టబయలు.. దొరికిన ఆస్తులు చూసి అందరూ షాక్..
Acb Raids
Ayyappa Mamidi
|

Updated on: Mar 17, 2022 | 1:51 PM

Share

Karnataka ACB raids: అక్రమాస్తుల కేసులో కర్ణాటక ఏసీబీ నిన్న భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. వీటిలో వారి దిమ్మతిరిగే స్థాయిలో కోట్ల విలువైన ఆస్తులు(Unaccounted Assets) బయటపడ్డాయి. వాటిని అధికారులు సీజ్(Seize) చేశారు. ఇవన్నీ రాజకీయనాయకుల ఇళ్లో, లేక వ్యాపారవేత్తల ఇళ్లో కాదు అక్షరాలా ప్రభుత్వ అధికారుల నివాసాల్లో దొరికిన అక్రమ సొమ్ము. కర్ణాటక వ్యాప్తంగా 75 ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇందులో 18 మంది ప్రభుత్వ అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ లో అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు 100 మందికి పైగా అధికారులు.. 300 మందికి పైగా వివిధ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ రెయిడ్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏసీబీ సోదాలు నిర్వహించిన వారిలో.. అదనపు కమిషనర్లు, ఇంజినీర్లు, అటవీ శాఖ అధికారులు, మేనేజర్ స్థాయి అధికారులు సైతం ఉన్నారు.

సోదాల్లో బయటపడ్డ వెండి, బంగారం

సోదాల్లో బయటపడ్డ వెండి, బంగారం

కర్ణాటక ఏసీబీ చేపట్టిన ఈ సోదాల్లో.. లెక్కలో చూపని నగదు, బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, ఖరీదైన గృహసామగ్రి, ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున భూమి పత్రాలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూముల ఆస్తి పత్రాలను వారు సోదాల్లో గుర్తించారు. ఇంకా విలాసవంతమైన హోమ్ థియేటర్లు, బ్యాడ్మింటన్ కోర్టులు సైతం గుర్తించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. వాటన్నిటినీ చూసిన అధికారులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ అధికారుల నివాసాల్లో సోదాలు జరపటం ఒక సంచలనం కాగా.. అక్కడ దొరికిన అక్రమ ఆస్తుల విలువ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

అధికారి ఇంట్లో బయటపడ్డ గంధపు చెక్కలు

అధికారి ఇంట్లో బయటపడ్డ గంధపు చెక్కలు

కర్ణాటక బాగల్​కోటె జిల్లాలోని బదామీ అటవీ రేంజ్ అధికారికి చెందిన ప్రదేశాలను సోదా చేయగా.. 3 కిలోల గంధపు చెక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘కృష్ణ భాగ్య జలనిగమ్ లిమిటెడ్’ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి పాటిల్ ఇంట్లో రూ.7 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మైసూర్ విజయనగర్ పోలీస్ స్టేషన్​ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, చామరాజనగర్ ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ చెలువురాజ నివాసాల్లో విలువైన పత్రాలు దొరికాయి.

ఇవీ చదవండి..

Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..

Multibagger Returns: లక్షను.. రెండున్నర నెలల్లో రూ. 8 లక్షలు చేసిన స్టాక్.. మార్కెట్ పడిపోతున్నా పైపైకి..